వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకున్న వాహనాలను సంబంధిత యజమానులకు తిరిగి అప్పగించేందుకు .చర్యలు సన్ ప్రీత్ సింగ్ ఐపీఎస్

సాక్షి డిజిటల్ న్యూస్ ఫిబ్రవరి 9 తెలంగాణ స్టేట్ ఇన్చార్జి శ్రీనివాస్ రెడ్డి

వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకున్న వాహనాలను సంబంధిత యజమానులకు తిరిగి అప్పగించేందుకు చర్యలు చేపట్టినట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్, ఐపీఎస్ వెల్లడించారు.ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ… పలు ఘటనల నేపథ్యంలో స్వాధీనం చేసుకున్న వాహనాలను హనుమకొండ భీమారం లోని సీఆర్‌పీఎఫ్ కేంద్రంలో భద్రపరిచినట్లు తెలిపారు. పోలీస్ స్టేషన్‌ల వారీగా వాహనాలను గుర్తించి, సంబంధిత యజమానులకు ఇప్పటికే నోటీసులు జారీ చేసినట్లు చెప్పారు.తగిన ఆధారాలతో ముందుకు వచ్చే వాహన యజమానులకు చట్టపరమైన విధానాలను పూర్తి చేసిన అనంతరం వాహనాలను తిరిగి అందజేయనున్నట్లు స్పష్టం చేశారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ వాహనాలను తీసుకువెళ్లాలని కమిషనర్ సూచించారు.మరిన్ని వివరాల కోసం సీసీఆర్‌బీ ఏసీపీ డేవిడ్ రాజ్‌ను లేదా ఎంటీఓ రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ శ్రీధర్ (8712685158), సీసీఆర్‌బీ ఇన్‌స్పెక్టర్ మల్లయ్య (8008389789) నంబర్లను సంప్రదించాలని పోలీస్ కమిషనర్ ఒక ప్రకటనలో తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *