గురువారం MCH ఆసుపత్రిలో నిర్వహిస్తున్న Eye SADAREM–UDID శిబిరాన్ని జగిత్యాల అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్) రాజా గౌడ్, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి (DRDO) రఘువరన్ తో కలిసి పరిశీలించారు

సాక్షి ఫిబ్రవరి 19 ధర్మపురి నియోజకవర్గ రిపోర్టార్ అజయ్ :

ఈ సందర్భంగా MCH బ్లాక్‌లోని OP వార్డులు, వ్యాక్సిన్ వార్డులు, OP రిజిస్ట్రేషన్ విభాగం, ఫార్మసీ విభాగం మరియు ల్యాబ్ విభాగాన్ని సందర్శించి, రోగులకు అందిస్తున్న వైద్య సేవలు మరియు సదుపాయాలను సమగ్రంగా పరిశీలించారు.అదేవిధంగా పాత ఆసుపత్రి భవనంలో కొనసాగుతున్న SADAREM–UDID పునరుద్ధరణ (Renovation) పనులను కూడా పరిశీలించి, పనుల నాణ్యత మరియు వేగాన్ని మరింత మెరుగుపరచాలని కాంట్రాక్టర్లకు పలు సూచనలు చేశారు. రోగులకు అందిస్తున్న వైద్య సేవలపై వారు సంతృప్తి వ్యక్తం చేస్తూ, సేవలను మరింత సమర్థవంతంగా మరియు మెరుగుపరచాలని సంబంధిత అధికారులకు సూచించారు.ఈ కార్యక్రమంలో MCH ఆసుపత్రి పరిపాలనా అధికారి వేణుకొండల్ రెడ్డి, RMOలు డా. మహేష్ రావు, డా. శ్రీపతి, డా. విజయ్ కుమార్ రెడ్డి మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *