సాక్షి ఫిబ్రవరి 20 ధర్మపురి నియోజకవర్గ రిపోర్టార్ అజయ్ :
ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్న మంత్రి అడ్లూరి..సీనియర్ కాంగ్రెస్ నాయకులు, మాజీ మంత్రి జీవన్ రెడ్డి అస్వస్థతకు గురై సికింద్రాబాద్ లోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
జీవన్ రెడ్డి ఆనారోగ్యం విషయం తెలుసుకున్న రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి శ్రీ అడ్డూరి లక్ష్మణ్ కుమార్ బుధవారం జగిత్యాల జిల్లా పర్యటనను వాయిదా వేసుకున్నారు.సికింద్రాబాద్ లోని కిమ్స్ ఆసుపత్రికి వెళ్లి జీవన్ రెడ్డిని పరామర్శించారు.ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మాజీ మంత్రి జీవన్ రెడ్డి త్వరగా కోలుకోవాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆకాంక్షించారు.

