స్థానిక సంస్థల్లో బిసిలకు 42% రిజర్వేషన్లు కల్పించిన
సాక్షి ఫిబ్రవరి 20 ధర్మపురి నియోజకవర్గ రిపోర్టార్ అజయ్ :
జడ్.పి.టి.సి., ఎం.పి.టి.సి. ఎన్నికలకు వెళ్ళాలి. లేనిచో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేస్తాము.
రాష్ట్ర ప్రభుత్వము ఎన్నికల కంటే ముందు కామారెడ్డి డిక్లరేషన్లో బిసిలకు 42% రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో కల్పిస్తామని చెప్పి, 42% రిజర్వేషన్లను కల్పించకుండానే సర్పంచ్ ఎన్నికలకు వెళ్ళినారు, మున్సిపల్ ఎన్నికలకు కూడా వెళ్ళినారు. బిసిలపైన మీకున్న ప్రేమ, మీ చిత్తశుద్ధికి ఇది నిదర్శనం. కావున రాష్ట్ర ముఖ్యమంత్రివర్యుల గారికి రాబోయే జడ్.పి.టి.సి., యం.పి.టి.సి. ఎన్నికల్లోనైనా బిసిలకు 42% రిజర్వేషన్లు కల్పించిన తర్వాతనే ఎన్నికలకు వెళ్ళాలని బిసి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.గత సంవత్సరము నుండి అనేక మార్లు అనగా 120సార్లకు పై రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలలో ఉద్యమాలు, ధర్నాలు, ర్యాలీలు, నిరాహార దీక్షలు, కుల సంఘ సమావేశాలు, రౌండ్ టేబుల్ సమావేశాలు, సత్యాగ్రహ దీక్షలు, ధర్మ దీక్షలు, న్యాయ పోరాట దీక్షలు, చివరికి రాష్ట్ర బంద్ కూడా జరుపడం జరిగింది. అయినా ప్రభుత్వం ఉద్యమాలకు స్పందించకుండా, ఉద్యమాలను గుర్తించకుండా బిసిలకు వెన్నుపోటు పొడిచి, ఇచ్చిన మాటను నిలబెట్టు కోకుండా ఎన్నికలకు వెళ్ళినారు. బిసిలంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఇంత చిన్న చూపా! బిసి నాయకులపై దాడులు, బెదిరింపులు, కుట్రలు, కుతంత్రాలు ఎన్ని చేసినా మేము సహించాము. కానీ, ఈ ఎన్నికలలో రిజిర్వేషన్ల విషయంలో మాత్రం సహించేది లేదు. బిసి రిజర్వేషన్ల రక్షణ కోసం రాష్ట్ర బందుతో పాటు బిసి ఉద్యమాన్ని పల్లెపల్లెకు, ఇంటి ఇంటికి తీసుకు వెళ్ళి ప్రజా ఉద్యమంగా మారనుంది కావున రాష్ట్ర ప్రభుత్వం బిసిలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తున్నాము.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి ముసిపట్ల లక్ష్మీనారాయణ, బి.సి యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు కొక్కు గంగాధర్,వెన్న మహేష్. రాపర్తి రవి బి.సి యువజన సంఘం జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ తిరుపురం బి.సి మహిళా సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి రాచకొండ రోజా (న్యాయవాది), బిసి యువజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు అనుమల్ల సంజయ్ సామ్రాట్, బిసి సంక్షేమ సంఘం జగిత్యాల మండలాధ్యక్షుడు గుంటి గంగారాం, బిసి సంక్షేమ సంఘం జగిత్యాల మండలాధ్యక్షుడు బందెల మల్లయ్య, యూత్ కో-ఆర్డినేటర్ హృషికేష్, బిసి నాయకులు తదితరులు పాల్గొన్నారు.