సాక్షి డిజిటల్ న్యూస్ ఫిబ్రవరి 21 ధర్మపురి నియోజకవర్గ రిపోర్టార్ అజయ్ : శుక్రవారం జగిత్యాల జిల్లాలో జగిత్యాల ఆర్డీవో కార్యాలయంను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్. జాతీయ రహదారి పనులకు సంబంధించిన అవార్డు కాపీలను రైతులకు త్వరగా ఇవ్వాలని, పెండింగ్ పనులను వేగవంతం చేయాలని తెలిపారు. అలాగే తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూ భారతి రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన భూ సమస్యలపై ప్రతి దరఖాస్తును శూన్యంగా పరిశీలించి త్వరగా పూర్తి చేయాలని మరియు మీసేవ సర్టిఫికెట్లను పెండింగ్ ఉంచకుండా ఎప్పటికప్పుడు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు. ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియ ను మరింత వేగవంతం చేస్తూ అలాగే మ్యాపింగ్ లో ఎటువంటి పొరపాట్లకు తావులేకుండా, తప్పు ఎంట్రీ లు జరగకుండా ప్రతి ఓటరు మ్యాప్ అయ్యేవిధంగా ప్రతి ఇంటినుండి ఖచ్చితమైన మరియు నిర్ధిష్టమైన వివరాలు సేకరించేలా అన్ని స్థాయి ల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ఈ పరిశీలనలో జగిత్యాల రెవెన్యూ డివిజనల్ అధికారి మధు సూదన్, తహసీల్దార్ లు రామ్మోహన్, వరందన్ మరియు రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.