
-లావోస్ దేశంలో సైబర్ ఫ్రాడ్ ఉద్యోగాల పేరుతో యువతను అక్రమంగా తరలించి మోసాలకు పాల్పడిన 4 గురి అరెస్ట్ – నాలుగు సెల్ ఫోన్లు, కీలక పత్రాలు స్వాధీనం.
-పాస్‌పోర్టులు స్వాధీనం చేసుకుని బలవంతంగా సైబర్ మోసాలు చేయించినట్టు వెలుగులోకి
సాక్షి డిజిటల్ న్యూస్ ఫిబ్రవరి 21 ధర్మపురి నియోజకవర్గ రిపోర్టార్ అజయ్ :విదేశీ ఉద్యోగాల పేరుతో యువతను మోసం చేసి లావోస్ దేశానికి అక్రమంగా తరలించిన గ్యాంగ్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్ గారు తెలిపారు. జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. పట్టుబడిన నిందితులు:ఇస్లావత్ విజయేందర్ @ ఆండ్రూ – ఒబులుపూర్ తండా, మల్లాపూర్ మండలం మీసాల రాజశేఖర్ – పెంబట్ల గ్రామం, సారంగాపూర్ మండలం దండుగుల కళ్యాణ్ – రమేష్ ఒడ్డెర కాలనీ, రంగపేట గ్రామం శ్యామ్ రావు రాజశేఖర్ – ధర్మపురి రాజు – వైజాగ్, ప్రస్తుతం లావోస్‌లో ఉన్నాడు) నిందితుడు విజయేందర్ 2024 నవంబర్‌లో లావోస్ వెళ్లి అక్కడి సైబర్ ఫ్రాడ్ నెట్‌వర్క్‌లో చేరాడు. ప్రతి వ్యక్తిని లావోస్‌కు రప్పిస్తే ఒక్కొక్కరికి 13,000 యువాన్లు (సుమారు ₹1.75 లక్షలు) కమిషన్ ఇస్తామని చెప్పడంతో జగిత్యాల మరియు పరిసర ప్రాంతాల యువతను రిక్రూట్ చేయడం ప్రారంభించాడు. మరియు బ్యాంకాక్ కాల్ సెంటర్ ఉద్యోగం పేరుతో ఒక్కొక్కరి నుండి ₹75,000 నుండి ₹1,05,000 వరకు వసూలు చేసి, ముందుగా టూరిస్టు వీసాపై థాయిలాండ్ (బ్యాంకాక్) కు రప్పించి, అక్కడి నుండి ఏజెంట్ల ద్వారా సరిహద్దు అక్రమంగా దాటి లావోస్ దేశంలోని గోల్డెన్ ట్రయాంగిల్ ప్రాంతానికి తరలించేవారు. అక్కడ చైనా కంపెనీల ఆధ్వర్యంలో నడుస్తున్న సైబర్ కాల్ సెంటర్లలో పని చేయమని బలవంతం చేసేవారు.అమెరికా ఇన్ఫ్లుయెన్సర్ల పేర్లతో నకిలీ సోషల్ మీడియా ఖాతాలు సృష్టించి, ముఖ్యంగా USAలో నివసిస్తున్న భారతీయులను లక్ష్యంగా చేసుకుని ఆన్‌లైన్ మోసాలు చేయించేవారు. పని చేయనని చెప్పిన వారికి పాస్‌పోర్టులు ఇవ్వకుండా బెదిరింపులకు పాల్పడేవారు.మోసపోయిన బాధితుని ఫిర్యాదు మేరకు జగిత్యాల రూరల్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడు విజయేందర్‌పై లుక్ అవుట్ సర్క్యులర్ జారీ చేయగా, 17-02-2026 న Rajiv Gandhi International Airport లో అరెస్ట్ చేసి జగిత్యాల రూరల్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. విచారణలో మిగతా ముగ్గురు నిందితుల వివరాలు వెలుగులోకి రావడంతో వారిని కూడా అరెస్ట్ చేసి, వారి వద్ద నుండి 4 సెల్ ఫోన్లు, కీలక పత్రాలు, విదేశీ ప్రయాణాలకు సంబంధించిన డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు.