ధర్మపురిలో బ్రహ్మోత్సవాల సమన్వయ సమావేశం-మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

-ధర్మపురి పట్టణ కేంద్రంలోని ఓల్డ్ టిటిడి లో శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించనున్న బ్రహ్మోత్సవాల (జాతర) ఏర్పాట్లపై శనివారం సమన్వయ సమావేశం నిర్వహించారు.

సాక్షి డిజిటల్ ఫిబ్రవరి 21 ధర్మపురి నియోజకవర్గ రిపోర్టార్ అజయ్ : ఈ సమావేశంలో రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రివర్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ గారు, ఎస్పీ అశోక్ గార్లతో కలిసి పాల్గొన్నారు. రాబోయే బ్రహ్మోత్సవాలను భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఘనంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లపై అధికారులు చర్చించారు.భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, తాగునీరు, పారిశుధ్యం, వైద్య సదుపాయాలు తదితర అంశాలపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులకు సూచించారు.భక్తులకు సౌకర్యవంతమైన దర్శనం కల్పించేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు ఆదేశించారు.అనంతరం బ్రహ్మోత్సవాల వాల్ పోస్టర్లు ఆవిష్కరించారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *