ప్రమాదకరంగా కరెంటు పోల్స్ స్తంభములు పెద్దగాలి వస్తే అనేక ప్రమాదాలకు నిలయం
సాక్షి డిజిటల్ న్యూస్ ఫిబ్రవరి 25. 2026 మంచిర్యాల జిల్లా జన్నారం మండలం రిపోర్టర్ మామిడి విజయ్
జన్నారం మండలంలోని మేజర్ గ్రామపంచాయతీ పొనకల్ తెలంగాణ తల్లి విగ్రహం దగ్గర ప్రధాన రహదారికి ఎడమవైపున గల విద్యుత్ స్తంభం ప్రమాద భరితంగా ఇనుప చూవ్వలు తేలి కాంక్రీట్ బిచ్చలు ఊడిపోయి పెద్ద గాలి వస్తే విరిగి కింద పడి రోడ్డుపై ప్రయాణించేటటువంటి పాదాచారులకి స్థానిక ప్రజానీకానికి ప్రమాదం జరిగే అవకాశం ఉంది జన్నారం మండల విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు పర్యవేక్షణ చేసి మరమ్మత్తులు చేయాల్సిన అవసరం ఉంది పాత కరెంటు పోల్ను తీసి కొత్త కరెంటు పోల్ను వేయాలి స్థానిక సర్పంచ్ గారు పాలకమండలి స్పందించాలి పెద్ద గాలులు వచ్చినప్పుడు కరెంటు స్తంభం సిమెంట్ పోల్ ఊగిసలాడుతుంది వైర్లు అంటుకొని మంటలు లేస్తున్నాయి అని స్థానికులు తెలిపారు.