Header Banner

ఇంటర్నేషనల్ బాల్ బ్యాడ్మింటన్‌లో గోల్డ్ మెడల్ సాధించిన దినేష్ కుమార్‌కు ఘన సన్మానం

సాక్షి డిజిటల్ న్యూస్, మార్చి 6 – తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి

మలేషియాలో నిర్వహించిన ఇంటర్నేషనల్ బాల్ బ్యాడ్మింటన్ పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించి దేశానికి కీర్తి తీసుకువచ్చిన క్రీడాకారుడు దినేష్ కుమార్ ను స్థానిక సీనియర్ నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా క్రీడాకారుడి ప్రతిభను కొనియాడుతూ అభినందనలు తెలిపారు.ఈ సన్మాన కార్యక్రమంలో సీనియర్ నాయకులు బి. విఠల్, ఎల్లం నాయుడు, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. అలాగే సంఘం అధ్యక్షులు ఎం. విఠల్, జనరల్ సెక్రటరీ బి. విఠల్, కోశాధికారి పి. విరేష్, ప్రతాప్, ఉదయ్, ఇశ్రాయేల్, అభి, శ్రీహరి, కళ్యాణ్, గోపీ సాయి తదితరులు హాజరై దినేష్ కుమార్‌ను శాలువా కప్పి ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా బి. విఠల్ మాట్లాడుతూ యువత క్రీడల్లో చురుకుగా పాల్గొని తమ శరీరాన్ని దృఢంగా ఉంచుకోవాలని సూచించారు. క్రీడలు కేవలం ఆరోగ్యానికి మాత్రమే కాకుండా మనశ్శాంతికి కూడా ఎంతో దోహదపడతాయని ఆయన పేర్కొన్నారు. క్రీడల ద్వారా యువతకు అనేక అవకాశాలు లభిస్తాయని, క్రీడా కోటా ద్వారా ప్రభుత్వ ఉద్యోగాలు కూడా సాధించవచ్చని తెలిపారు.యువత క్రీడలను జీవితంలో భాగంగా చేసుకుని అన్ని రంగాల్లో రాణించాలని ఆయన ఆకాంక్షించారు. దినేష్ కుమార్ సాధించిన విజయంతో స్థానిక యువతకు మంచి ప్రేరణ లభిస్తుందని కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు అభిప్రాయపడ్డారు.