సాక్షి 09-03-2026 ధర్మపురి నియోజకవర్గ రిపోర్టార్ అజయ్ :
2027లో జరగనున్న గోదావరి పుష్కరాల ఏర్పాట్ల నేపథ్యంలో చేపట్టాల్సిన భూసేకరణ (ల్యాండ్ అక్విజిషన్) మరియు దేవాలయ అభివృద్ధి పనులపై రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, వయోవృద్ధుల, వికలాంగుల మరియు ట్రాన్స్జెండర్ సాధికారత శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ గారితో కలిసి EO కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ…రానున్న గోదావరి పుష్కరాలు రాష్ట్రానికి అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఆధ్యాత్మిక వేడుక అని మంత్రి తెలిపారు. ఈ పుష్కరాలకు దేశం నలుమూలల నుండి లక్షలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశమున్నందున వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తుగా సమగ్ర ప్రణాళికతో ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు.పుష్కరాలకు అవసరమైన భూముల సేకరణ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేసి, అభివృద్ధి పనులను త్వరితగతిన ప్రారంభించాలని ఆదేశించారు. ధర్మపురి క్షేత్రం పుష్కరాల సమయంలో రాష్ట్రానికి ప్రతిష్ఠను తీసుకువచ్చేలా అన్ని ఏర్పాట్లు ఉండాలని మంత్రి పేర్కొన్నారు.


