కుక్కకాటుకు గురైన బాలుడికి 15 నెలలుగా చికిత్స

రూ.50 లక్షలు ఖర్చు చేసినా దక్కని ప్రాణం

సాక్షి మర్చి 17 ధర్మపురి నియోజకవర్గ రిపోర్టార్ అజయ్ :

జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం కోటిలింగాల గ్రామంలో, 2024 డిసెంబర్ 26వ తేదీన ఇంటి బయట ఆడుకుంటున్న శ్రీనివాస్ – మాధవి దంపతుల కుమారుడు మణితేజ(8)ను కరిచిన వీధికుక్క
ఆసుపత్రికి వెళ్లి టీకా వేయించి, ఇంటికి తీసుకెళ్లాక జ్వరం రావడంతో జగిత్యాలలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా, హైదరాబాద్ నగరానికి తరలించాలని తెలిపిన అక్కడి వైద్యులు హైదరాబాద్ నగరంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా, వెన్నుముక్క నుండి మెదడుకు వెళ్లే నరం దెబ్బతిన్నదని తెలిపిన వైద్యులు అప్పటినుండి శరీర కదలికలు తప్ప ఎలాంటి స్పందన లేకుండా ఉండడంతో, పూర్తిగా వెంటిలేటర్ మీదనే చికిత్స అందజేత బాలుడి ప్రాణాలు కాపాడుకునేందుకు వివిధ రకాలుగా రూ.50 లక్షలు ఖర్చు చేసినా కూడా బాలుడు మృతిచెందడంతో కన్నీటి పర్యంతమైన తల్లిదండ్రులు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *