Header Banner

బుగ్గారం పోలీస్ స్టేషన్‌లో స్వచ్ఛత కార్యక్రమం నిర్వహణ

సాక్షి మార్చ్ 17 ధర్మపురి నియోజకవర్గ రిపోర్టార్ అజయ్ :

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమం లో భాగంగా, జగిత్యాల జిల్లా గౌరవ ఎస్పీ శ్రీ అశోక్ కుమార్ IPS గారి ఆదేశాల మేరకు, ఈ రోజు బుగ్గారం పోలీస్ స్టేషన్ పరిధిలో స్వచ్ఛత కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడింది.ఈ కార్యక్రమంలో సబ్ ఇన్స్పెక్టర్ జి. సతీష్ గారి ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది పాల్గొని, పోలీస్ స్టేషన్ మరియు పరిసర ప్రాంతాలను పరిశుభ్ర పరచారు.ఈ సందర్భంగా సబ్ ఇన్స్పెక్టర్ గారు మాట్లాడుతూ, పరిశుభ్రమైన వాతావరణం ద్వారా ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించడం తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. అలాగే ప్రజలు కూడా స్వచ్ఛతపై అవగాహన కలిగి, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు.