సాక్షి మార్చ్ 18 ధర్మపురి నియోజకవర్గ రిపోర్టార్ అజయ్ :
బీసీ సంఘం నాయకులు మాజీ ఎంపీపీ PACS చైర్మన్ బుగ్గారం తాజా మాజీ జడ్పీటీసీ బాధినేని రాజేందర్, బుగ్గారం తాజా మాజీ ఎంపీపీ బాధినేని రాజమణి దంపతుల వివాహ వార్షికోత్సవాన్ని బీసీ సంఘం ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దంపతులు కేక్ కట్ చేసి పూల మాలలు మార్చుకొని వేడుకలు జరుపుకున్నారు. అనంతరం నాయకులు వారిని శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా రాజేందర్, రాజమణి మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి కృషి చేస్తామని, ప్రజల సేవలో ముందుండి పనిచేస్తామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు జాజాల రమేష్ నాయకులు రెండ్ల లక్ష్మీ రవీందర్ , బోగ మహేష్ , వంశీ కృష్ణ, సహ పలువురు నాయకులు పాల్గొన్నారు.

