ప్రస్తుత కాంగ్రెస్‌ సర్కారు ఎస్సీ, ఎస్టీ విద్యార్థులను గాలికి వదిలేసింది – మాజీ మంత్రి కొప్పుల

కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎస్సీ ఎస్టీ విద్యార్థులపై చిన్న చూపు ఎందుకు – మాజీ మంత్రి కొప్పుల

సాక్షి డిజిటల్ మార్చ్ 30 ధర్మపురి నియోజకవర్గ రిపోర్టార్ అజయ్ :

జగిత్యాల ఎస్టీ బాలుర హాస్టల్‌లో విద్యార్థుల చితకబాదడం, చెన్నూరు సోషల్ వెల్ఫేర్ స్కూల్‌లో విద్యార్థిని మరణం వంటి సంఘటనలపై మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ ఘటనలు కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యానికి చెందినవని, గురుకుల వ్యవస్థను నిర్వీర్యం చేసే కుట్రలు చేస్తోందని విమర్శించారు జగిత్యాల ఎస్టీ హాస్టల్ ఘటన వారం రోజుల క్రితం జగిత్యాల ఎస్టీ బాలుర హాస్టల్‌లో కామాటి శ్రీనివాస్ అనే వ్యక్తి మద్యం మత్తులో రాత్రి పడుకున్న విద్యార్థులను చీపురుతో చితకబాదడాన్ని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ ఘటన వారం రోజుల క్రితం జరిగిందని దాన్ని దాచే ప్రయత్నం చేశారని, అధికారుల పర్యవేక్షణ లోపమే కారణమని కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు మంచిర్యాల జిల్లా చెన్నూరు సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో 7వ తరగతి విద్యార్థిని శ్రీ హిందూ గడ్డి మందు తాగి చికిత్స పొందుతూ మరణించిందని, ఈ సంఘటనపై ఎస్టీ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ చర్యలు తీసుకోలేకపోవడం దురదృష్టకరమని ఈశ్వర్ అన్నారు తెలంగాణలో గత రెండేళ్లలో గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లు సహా 126 మంది విద్యార్థులు మృతి చెందారు, వీరిలో 54 మంది బాలికలు, 72 మంది బాలురు. నాణ్యమైన ఆహారం లేకపోవడం, కలుషిత ఆహారం, మానసిక ఒత్తిడి, పర్యవేక్షణ లోపాలే కారణమని ఆయన విమర్శిస్తున్నారు. ప్రస్తుత కాంగ్రెస్‌ సర్కారు ఎస్సీ, ఎస్టీ విద్యార్థులను గాలికి వదిలేసిందని ఆయన అన్నారు
కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎస్సీ ఎస్టీ విద్యార్థులపై చిన్న చూపు ఎందుకని ప్రశ్నించారు దళిత ఆదివాసుల పదవులు ఇచ్చాం అని చెప్పుకునే ‌కాంగ్రెస్ ప్రభుత్వం గురుకులాల్లో చదువుకున్న ఎస్సీ, ఎస్టీ విద్యార్థులపై చిన్న చూపు ఎందుకని ప్రశ్నించారు.పూర్తి స్థాయి దర్యాప్తు జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *