Header Banner

బుగ్గరాం మండల కేంద్రంలోనే శిక్షణా తరగతులు నిర్వహించాలి

జిల్లా కలెక్టర్ ప్రజా వాణిలో పిర్యాదు చేసిన "చుక్క లతశ్రీ"

శిక్షణా తరగతులను బుగ్గారం తరలించండి

డిపివో కు ఆదేశాలు జారీ చేసిన అదనపు కలెక్టర్ బి.రాజగౌడ్

సాక్షి డిజిటల్ ఏప్రిల్ 06 ధర్మపురి నియోజకవర్గ రిపోర్టార్ అజయ్ :

జిల్లా ఉన్నతాధికారుల షెడ్యూల్ ఆదేశాలను భే ఖాతర్ చేస్తూ, బుగ్గారం వార్డ్ సభ్యుల, గ్రామ ప్రజల మనోభావాలు దెబ్బ తీసే విధంగా…. ఉద్దేశ్య పూర్వకంగా వార్డు సభ్యుల శిక్షణా తరగతులను బుగ్గారం మండల కేంద్రం నుండి శేఖల్ల రైతు వేదికకు మార్చిన "బుగ్గారం ఎంపిడివో" పై చట్ట పరమైన, శాఖా పరమైన చర్యలు తీసుకొని బుగ్గారం మండల కేంద్రంలోనే నూతన "వార్డ్ సభ్యులకు శిక్షణా తరగతులు" నిర్వహింప జేయాలని కోరుతూ సోమవారం జిల్లా కలెక్టర్ ప్రజావాణిలో బుగ్గారం గ్రామ 11వ వార్డ్ సభ్యురాలు చుక్క లతశ్రీ పిర్యాదు చేశారు.సానుకూలంగా స్పందించిన జిల్లా అదనపు కలెక్టర్ బి.రాజ గౌడ్ వెంటనే జిల్లా పంచాయతీ అధికారి చీకోటి మదన్ మోహన్ ను పిలుచుకొని బుగ్గారం మండల కేంద్రంలోనే వార్డ్ సభ్యుల శిక్షణా తరగతులను నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. అనుక్షణమే జిల్లా పంచాయతీ అధికారి బుగ్గారం ఎంపిడివో వాసవి కి ఫోన్ కాల్ చేసి బుగ్గారంలోనే శిక్షణా తరగతులు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని తెలిపారు.జిల్లా కలెక్టర్ జారీ చేసిన షెడ్యూల్ ప్రకారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంతో పాటు పోచమ్మ ఫంక్షన్ హాల్ లో, ప్రైవేట్ పాఠశాలల్లో కూడా ఈ శిక్షణా తరగతుల నిర్వహణ కోసం అన్ని రకాల వసతులు ఉన్నాయని చుక్క లతశ్రీ అదనపు కలెక్టర్ బి.రాజగౌడ్ కు సూచించారు.