Header Banner

గ్రామాలకు వస్తా‌ ప్రజా సమస్యలు పరిష్కరిస్తా

రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్..

వెల్గటూర్లో కళ్యాణ లక్ష్మి సీఎం ఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేసిన మంత్రి అడ్లూరి..

సాక్షి డిజిటల్ ఏప్రిల్ 06 ధర్మపురి నియోజకవర్గ రిపోర్టార్ అజయ్ :

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో పర్యటించి ప్రజల సమస్యలను పరిష్కరిస్తానని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. సోమవారం జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఎండపల్లి, వెల్గటూర్ మండలాలకు చెందిన పలువురు లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులతో పాటు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను మంత్రి పంపిణీ చేశారు.ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఏర్పడిన ప్రజా ప్రభుత్వం ప్రజల సమస్యలు పరిష్కరిస్తూ ముందుకు సాగుతున్నామని అన్నారు. రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటిల్లో నాలుగు గ్యారంటీలు అమలు చేస్తున్నామని మంత్రి తెలిపారు. ఎన్నికల సమయంలో రాజకీయాలు చేయాలని ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన తర్వాత పార్టీలకు తీతంగా ప్రజల సమస్యలు పరిష్కరించాలని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు.ధర్మపురి నియోజకవర్గంలో ప్రజల సమస్యల పరిష్కారం ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ప్రతి గ్రామానికి వచ్చి సమస్యలు గుర్తించి వాటిని పరిష్కరిస్తానని మంత్రి హామీ ఇచ్చారు. ఎండపల్లి, వెల్గటూర్ మండలాలకు చెందిన 32 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కులను మంత్రి అందజేశారు. వివిధ ప్రైవేటు ఆసుపత్రిలో వైద్య చికిత్సలు చేయించుకున్న 78 మంది లబ్ధిదారులకు రూ. 25.40 లక్షల విలువైన చెక్కులను మంత్రి ఈ సందర్భంగా అందజేశారు. ముగ్గురు దివ్యాంగులకు మంత్రి స్కూటిలను మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అందజేశారు.