Header Banner

బుగ్గారం మండలంలో అరైవ్-అలైవ్ కార్యక్రమం

వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించి రోడ్డు ప్రమాదాలను నివారించాలి. బుగ్గారం ఎస్సై జి.సతీష్

సాక్షి డిజిటల్ న్యూస్: ఎప్రిల్14 (బుగ్గారం మండల రిపోర్టర్ కట్ట రాజేందర్)

జగిత్యాల జిల్లా బుగ్గారం మండల కేంద్రంలో మరియు మండలంలోని అన్ని గ్రామాలలో బుగ్గారం పోలీస్ వారి ఆద్వర్యంలో సోమవారం ఆరైవ్-అలైవ్ కార్యక్రమం నిర్వహించారు. బుగ్గారం ఎస్సై జి.సతీష్ మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారులందరూ హెల్మెట్ కచ్చితంగా ధరించాలని, మైనర్లు వాహనాలు నడిపినా,డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడినా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ప్రతి ఒక్కరు కృషిచేయాలని పిలుపునిచ్చారు.ప్రజలకు రోడ్డు భద్రత మరియు సామాజిక బాధ్యతపై అవగాహన కల్పించడంతో పాటు, అందరూ కలిసి రోడ్డు భద్రత ప్రమాణం (ప్లెడ్జ్) చేశారు.కార్యక్రమంలో భాగంగా గ్రామరోడ్డుపై ప్యాచ్ వర్క్ చేయడంతో పాటు, రోడ్డు పక్కన ఉన్న పొదలను తొలగించి ప్రయాణ భద్రతను మెరుగుపరచడం జరిగింది.ఈకార్యక్రమంలో పంచాయతీ రాజ్ సిబ్బంది, ఏయి, ఎంఈఓ, హెచ్ఎం, సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, పారామెడికల్ సిబ్బంది మరియు మహిళలు, యువకులు,తదితరులు పాల్గొన్నారు.