Header Banner

అంబేద్కర్ రాజ్యాంగమే దేశానికి రక్షక కవచం

సాక్షి ఏప్రిల్ 14 ధర్మపురి నియోజకవర్గ రిపోర్టార్ అజయ్ :

భారత రాజ్యాంగ నిర్మాత, ‘విశ్వ మేధావి’ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు.గొల్లపల్లి మండలం తిరుమలపూర్ గ్రామంలో అత్యంత వైభవంగా నిర్వహించబడ్డాయి. ఉత్సవ కమిటీ అధ్యక్షులు ఆరెల్లి రవీందర్, అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు చిర్ర చంద్రయ్య ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా తిరుమలాపూర్ గ్రామ సర్పంచ్ కాశ అంజలి గంగాధర్,రంగదామునిపల్లి గ్రామ సర్పంచ్ జెల్ల అఖిల అనిల్ కుమార్ పాల్గొని బాబాసాహెబ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం, స్వీట్లు పంపిణీ చేశారు.ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన సర్పంచులు మాట్లాడుతూ.భారత రాజ్యాంగం నేడు దేశంలోని ప్రతి పౌరుడికి రక్షక కవచంలా నిలుస్తోందని కొనియాడారు. "అంబేద్కర్ కేవలం ఒక వర్గానికి చెందిన వ్యక్తి కాదు; స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే పునాదులపై ఆధునిక భారతదేశాన్ని నిర్మించిన మహనీయుడు" అని పేర్కొన్నారు. ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాలని పిలుపునిచ్చారు.బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతిగా ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని, అందుకే ప్రపంచం ఆయనను మేధావుల జాబితాలో అగ్రస్థానంలో నిలిపిందని తెలిపారు.ఈ కార్యక్రమంలో రెండు గ్రామాల ఉపసర్పంచులు,వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శి,వివో ఏ, అంగన్వాడీ టీచర్స్,ఏఎన్ఎం, ఆశలు,అంగన్వాడి ఆయాలు, ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ లైన్మెన్లు, ఆలయ కమిటీ చైర్మన్,లు అభిమన్య యూత్ అధ్యక్షులు, కులా సంఘాల అధ్యక్షులు,రెండు గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని కనివిని ఎరుగని రీతిలో విజయవంతం చేశారు.