Header Banner

కామారెడ్డి జిల్లా కేంద్రంలో యూఎస్ ట్రేడ్ డీల్‌కు వ్యతిరేకంగా యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో సత్యాగ్రహ దీక్ష

సాక్షి డిజిటల్ న్యూస్ కామారెడ్డి జిల్లా ప్రతినిధి మొహమ్మద్ నయీమ్ ఏప్రిల్ 15

కామారెడ్డి జిల్లా కేంద్రంలో యూఎస్ ట్రేడ్ డీల్‌కు వ్యతిరేకంగా కామారెడ్డి జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో సత్యాగ్రహ దీక్ష కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో వివిధ రాజకీయ పార్టీలు, రైతు సంఘాలు ప్రతినిధులు పాల్గొని కేంద్ర ప్రభుత్వ విధానాలను తీవ్రంగా ఖండించారు.నాయకులు మాట్లాడుతూ యూఎస్ ట్రేడ్ డీల్ వల్ల దేశీయ రైతులు, వ్యవసాయ రంగం తీవ్రంగా నష్టపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఒప్పందం వల్ల విదేశీ కంపెనీలకు అధిక ప్రాధాన్యం లభించి, స్థానిక ఉత్పత్తులు మరియు రైతుల జీవనోపాధిపై ప్రతికూల ప్రభావం పడుతుందని పేర్కొన్నారు.అలాగే, ప్రభుత్వం రైతుల ప్రయోజనాలను కాపాడే విధంగా నిర్ణయాలు తీసుకోవాలని, యూఎస్ ట్రేడ్ డీల్‌ను వెంటనే పునర్విమర్శించాలని డిమాండ్ చేశారు.ఈ సత్యాగ్రహ దీక్షలో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొని తమ నిరసనను వ్యక్తం చేశారు ఈ కార్యక్రమానికి జాతీయ యువజన కార్యదర్శి రోషిణి జైస్వాల్ కామారెడ్డి మున్సిపల్ ఛైర్మన్ ఉమారాణి విచ్చేసి నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపచేశారు ఈకార్యక్రమంలో నియోజకవర్గం అధ్యక్షులు శ్రీనివాస్,సర్దార్,ఇమ్రోజ్ ఎస్ యు ఐ అధ్యక్షులు సందీప్ జిల్లా కార్యదర్శులు అజ్మత్,అన్వేష్ తదితరులు పాల్గొన్నారు...