Header Banner

తిరుమలాయపాలెం ఎస్ఐ కూచిపూడి జగదీష్ కు జన్మదిన శుభాకాంక్షలు.

మండల కాంగ్రెస్ నాయకులు కట్కూరి శ్రీనివాసరెడ్డి

సాక్షి డిజిటల్ న్యూస్ ఏప్రిల్ 17 (పాలేరు రిపోర్టర్ పి వెంకన్న)

తిరుమలాయపాలెం పోలీస్ స్టేషన్ ఎస్ హెచ్ ఓ కూచిపూడి జగదీష్ కి శుక్రవారం మండల కాంగ్రెస్ నాయకులు కట్కూరి శ్రీనివాసరెడ్డి, తవడబోయిన కృష్ణ, మోరపాక నాగయ్య ఇందుర్తి మధుసూదన్ రెడ్డి ,మండల ఎస్సైకు జగదీష్ కు స్థానిక పోలీసు స్టేషన్ లో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా కట్కూరి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన దగ్గర నుండి మండలంలో శాంతిభద్రతలు పరిరక్షణలో ఆయన ఎనలేని కృషి చేశారని, జరిగిన స్థానిక సంస్థల ఎలక్షన్లలో పూర్తి బందోబస్తు ఏర్పాటు చేసి ఎక్కడ ఎలాంటి గొడవలు కాకుండా విజయవంతంగా ఎన్నికలు పూర్తి చేశారని, అదేవిధంగా మండలంలో డ్రగ్స్ నివారణ కోసం కృషి చేయడం, మరియు రోడ్డు ప్రమాదాలు తగ్గుటకు భద్రతా చర్యల గురించి పలు చైతన్యవంతమైన కార్యక్రమాలు తీసుకోవడం, ఈ సందర్భంగా ఆయనకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ,మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.