Header Banner

ఘనంగా జి ఎల్ ఎన్ రెడ్డి జన్మదిన వేడుకలు

సాక్షి డిజిటల్ న్యూస్, ఏప్రిల్ 23 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి కూకట్‌పల్లి రాజకీయ వేదికపై స్థానిక నాయకత్వానికి గుర్తింపు పొందిన గజ్జెల లక్ష్మీనారాయణ రెడ్డి (జి ఎల్ ఎన్ రెడ్డి) జన్మదిన వేడుకలు అభిమానులు, పార్టీ నాయకుల సమక్షంలో అంగరంగ వైభవంగా నిర్వహించ బడ్డాయి. ఈ వేడుకలు కేవలం జన్మదిన సంబరాలకే పరిమితం కాకుండా, స్థానిక రాజకీయాల్లో ఆయనకు ఉన్న పట్టు, ప్రజల్లో ఉన్న ఆదరణను ప్రతిబింబించే విధంగా సాగాయి.జన్మదినం సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ నాయకులు, రెడ్డి సంఘం ప్రతినిధులు, అలాగే జి ఎల్ ఎన్ అభిమానులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. బండి మధుసూదన్ రెడ్డి, ఉపేందర్ రెడ్డి తదితరులు కలిసి కేక్ కట్ చేయించి, శాలువాలతో ఘనంగా సన్మానించి తమ శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమం అంతటా ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది.మీడియా ప్రతినిధులు కూడా ఈ వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. “సూర్య ఉదయం తెలంగాణ” ఎడిటర్ భాష, స్థానిక విలేకరులు శ్యామ్ సుందర్, క్రాంతి కుమార్ పాల్గొని జి ఎల్ ఎన్ రెడ్డిని శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ, “మంచితనానికి ప్రతీక అయిన జి ఎల్ ఎన్ రెడ్డి భవిష్యత్తులో మరింత ఉన్నత స్థానాలను అధిరోహించాలని, ఎల్లప్పుడూ మేము ఆయనకు అండగా నిలుస్తాం” అని పేర్కొన్నారు. అభిమానుల స్పందన ఈ వేడుకలకు ప్రత్యేక శోభను తెచ్చింది. “అన్న అంటే నేనున్నా” అంటూ ముందుకు వచ్చి తమ అనుబంధాన్ని వ్యక్తం చేశారు. జి ఎల్ ఎన్ రెడ్డి చిరునవ్వుతో ప్రజల మనసులు గెలుచుకుంటూ మరెన్నో సంవత్సరాలు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో శివారెడ్డి, దీపక్ రెడ్డి, అఖిల్ రెడ్డి, అమర్నాథ్ రెడ్డి, అశోక్ రెడ్డి, కచ్చిన్ మహబూబ్, నాగభూషణ్ రెడ్డి, తులసి రెడ్డి, సాయినాథ్ రెడ్డి, గాల్ రెడ్డి, తిరుపతి కోటేశ్వర్ రావు, ఆదిరెడ్డి, సుబ్బారెడ్డి, వెంకట్రామి రెడ్డి, హరి, మూర్తి, హుస్సేన్, స్వరూప్, వేణు, శ్యామ్, శ్రీధర్, ప్రేమ్, అభినయ్, అభి తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. పార్టీలకు అతీతంగా నాయకులు, అభిమానులు హాజరవడం ఈ వేడుకలకు విశేష ప్రాధాన్యతను చేకూర్చింది.