Header Banner

విద్యార్థులకు వేసవి సెలవులు పిల్లల భద్రతపై తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి పరకాల సిఐ క్రాంతి కుమార్

సాక్షి డిజిటల్ న్యూస్ హన్మకొండ జిల్లా.24/4/2026 పరకాల నియోజకవర్గం సాక్షి డిజిటల్ న్యూస్ రిపోర్టర్ మడికొండ పవన్

కుమార్తెలంగాణ రాష్ట్రంలో పాఠశాలలకు వేసవి సెలవులు ప్రారంభమయ్యాయి సాధారణంగా ఏప్రిల్ చివరి వారంలో ప్రారంభమయ్యే ఈ సెలవులు మే నెల అంతా కొనసాగుతాయి ఈ సమయంలో ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరిగే అవకాశం ఉండడంతో పిల్లలు హిట్ స్ట్రోక్. డిహైడ్రేషన్ వంటి ఆరోగ్య సమస్యలకు గురయ్యే ప్రమాదం ఉందని అందువల్ల తల్లిదండ్రులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని పరకాల సిఐ క్రాంతి కుమార్ సూచించారు సెలవుల సమయంలో పిల్లలు ఎక్కువ గా బయటకు ఆడుకోవడం నీటి వనరుల దగ్గరికి వెళ్లడం రోడ్లపై నిర్లక్ష్యంగా తిరగడం వంటి కారణాలతో ప్రమాదాలు జరిగే అవకాశాలు పెరుగుతాయి ముఖ్యంగా బావులు చెరువులో కాలువలు వంటి ప్రాంతాల వద్ద పిల్లలను ఒంటరిగా వదలకూడదని అలాగే సైకిల్ లేదా ఇతర వాహనాలు నడిపేటప్పుడు ట్రాఫిక్ నియమాలను పాటించేలా తల్లిదండ్రులు పిల్లలకు అవగాహన కల్పించాలని కోరారు ఎండల నుండి రక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పిల్లలను బయటకు వెళ్ళనివ్వకండి తరచు నీరు. మజ్జిగ. నిమ్మరసం. కొబ్బరి నీరు వంటి ద్రవాలు తాగించండి తలపై టోపీ లేదా టవల్ కప్పుకునే అలవాటు చేయండి ఎక్కువ సేపు ఎండలో ఆటలో ఆడకుండా నియంత్రించండి మొబైల్ ఫోన్ వినియోగంపై నియంత్రణ అవసరం సెలవుల సమయంలో పిల్లలు మొబైల్ ఫోన్ వీడియో గేమ్స్ సోషల్ మీడియాకు ఎక్కువగా అలవాటు పడే ప్రమాదం ఉంది ఇది కంటి సమస్యలు నిద్రలేమి చదువుపై ఆసక్తి తగ్గడం వంటి సమస్యలకు కారణమవుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు అందువల్ల రోజుకు పరిమిత సమయం మాత్రమే మొబైల్ వినియోగానికి అనుమతించాలని సూచించారు ప్రమాదాలు నివారించేందుకు ముఖ్య సూచనలు చిన్నపిల్లలను ఒంటరిగా బయటకు పంపకండి నీటి వనరుల దగ్గర పెద్దల పర్యవేక్షణ తప్పనిసరి ఇంట్లో గ్యాస్ స్టవ్ విద్యుత్తు పరికరాలు దగ్గర పిల్లలను ఒంటరిగా వదలకండి అపరిచిత వ్యక్తులతో మాట్లాడవద్దని పిల్లలకు సూచించండి పిల్లలకు సెలవులను ఉపయోగకరంగా మార్చండి వేసవి సెలవులు పిల్లల ప్రతిభను పెంపొందించుకునే మంచి సమయం ఈ సమయంలో పుస్తకాలు చదవడం క్రీడలు ఆడడం డ్రాయింగ్ సంగీతం వంటి సృజనాత్మక కార్యక్రమాల్లో పాల్గొనేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలి కుటుంబ సభ్యులతో సమయం గడపడం వల్ల పిల్లల్లో మంచి విలువలు పెరుగుతాయి వేసవి సెలవులు పిల్లలకు ఆనందాన్ని ఇచ్చే సమయం అయినప్పటికీ తల్లిదండ్రుల జాగ్రత్తలు చాలా ముఖ్యమైనవి ముందస్తు చర్యలు తీసుకుంటే ప్రమాదాలను నివారించవచ్చు పిల్లల ఆరోగ్యం భద్రత మరియు భవిష్యత్తు కోసం ప్రతి కుటుంబం అప్రమత్తంగా ఉండాలి అని పరకాల సిఐ క్రాంతికుమార్ పత్రిక ముఖంగా తెలియజేశారు.. ఎండ్