October 8, 2026
Breaking News

క్రైమ్ వార్తలు వైరల్ వార్తలు

కుక్క కోసం గొడవ.. యువకుడిపై ఐదుగురు వృద్ధుల దాడి! (వీడియో చూడండి)

కుక్క కోసం గొడవ.. యువకుడిపై ఐదుగురు వృద్ధుల దాడి! (వీడియో చూడండి)

సాక్షీ డిజిటల్ న్యూస్ :- బెంగళూరు లో పెంపుడు కుక్క విషయంలో జరిగిన గొడవ తీవ్ర ఘర్షణకు దారితీసింది. బ్రిగేడ్ యుటోపియాలోని ఈస్ట్ ఆంటోపియా అపార్ట్‌మెంట్‌లో నివసించే తరుణ్ అరోరా ఓ ఉదయం తన పెంపుడు కుక్కను తీసుకుని అపార్ట్‌మెంట్ వాకింగ్ ఏరియాలోకి వెళ్లాడు. అక్కడ కొంతమంది వృద్ధులు వ్యాయామాలు చేస్తుండగా, ఆ ప్రాంతంలోకి కుక్కను తీసుకురావడంపై వారు అభ్యంతరం వ్యక్తం చేశారు.

వాకింగ్ ఏరియా వృద్ధుల కోసం కేటాయించిందని, కుక్కను అక్కడికి తీసుకురావద్దని వారు తరుణ్‌తో వాగ్వాదానికి దిగినట్లు సమాచారం. కుక్క అక్కడ మూత్రం పోసి ప్రదేశాన్ని అపరిశుభ్రం చేస్తుందని వారు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అయితే తరుణ్ అక్కడి నుంచి వెళ్లేందుకు నిరాకరించడంతో మాటామాటా పెరిగి గొడవగా మారింది.

ఆ తర్వాత కొంతమంది వృద్ధులు గుంపుగా చేరి తరుణ్‌పై దాడి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. మొదట తరుణ్ కూడా ప్రతిఘటించినప్పటికీ, ఐదారుగురు ఒకేసారి దాడి చేయడంతో కిందపడిపోయాడు. అయినప్పటికీ అతడిని వదలకుండా కొట్టినట్లు సమాచారం. తరుణ్ భార్య అడ్డుకునేందుకు ప్రయత్నించినా పరిస్థితిని అదుపు చేయలేకపోయింది.

ఈ ఘటన మొత్తం అపార్ట్‌మెంట్‌లోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డైనట్లు తెలుస్తోంది. దాడికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఘటనపై తరుణ్ పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే దాడికి దారితీసిన పూర్తి కారణాలు, ఇరువర్గాల వాదనలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.

#బెంగళూరు #కర్ణాటక #పెంపుడుకుక్క #కుక్కవిషయంలోగొడవ #వృద్ధులదాడి #యువకుడిపైదాడి #సీసీటీవీవీడియో #వైరల్వీడియో #Bengaluru #Karnataka #PetDog #DogIssue #Attack #ViralVideo #CCTVFootage #ViralNews

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📰 ePaper