మార్పు కోసం రగులుతున్న మెక్సికో యువత—జెన్‌జీ గళం దేశాన్ని కుదిపేస్తోంది

సాక్షి డిజిటల్ న్యూస్ :మెక్సికో రోజురోజుకూ వేడెక్కుతోంది. దేశంలో జరుగుతున్న అవినీతి, హింసాత్మక సంఘటనలు పెరుగుతుండడంతో నిరసనకారులు ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలోనే మెక్సికో సిటీ వీధుల్లో వేలాది మంది ప్రజలు నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. అయితే, నిరసనకారులు మాంగా-నేపథ్య జెండాలతో నిరసన ప్రదర్శించగా.. ఈ జెండాలలో ఒకదానిపై గడ్డి టోపీ ధరించిన పుర్రె బొమ్మ కూడా ఉంది. ఇందులో భాగంగానే ఒక కార్టూన్ జెండాను ఉపయోగించడం విచిత్రమైన ఆలోచనగా అనిపించింది. మెక్సికో వీధుల్లో నిండిన జెన్ జెడ్ నిరసనకారులకు, ఈ సింబల్ వెనుక లోతైన భావోద్వేగాలు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా జెన్ జెడ్ నిరసనలకు ‘పైరేట్ స్కల్ ఫ్లాగ్’ చిహ్నంగా మారినట్లే.. నిరసనకారులు తరచుగా ప్రజాదరణ పొందిన పాత్రలు, చిహ్నాలను ఒక ఉమ్మడి కారణాన్ని లేదా విలువ వ్యవస్థను తెలియజేయడానికి ఉపయోగిస్తారని అల్ జజీరా నివేదించింది. అయితే దేశంలో పెరుగుతున్న నేరాలు, అవినీతికి వ్యతిరేకంగా ఆ దేశ అధ్యక్షురాలు క్లాడియా షిన్ బామ్ రాజీనామా చేయాలని నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు. మెక్సికోలో పెరుగుతున్న నేరాలు, అవినీతి, శిక్షార్హత లేకపోవడాన్ని నిరసిస్తూ జెన్ జెడ్ ప్రజలు వీధుల్లోకి వచ్చారు. ప్రతి ఏడాది పదివేల మంది మెక్సికన్ల ప్రాణాలను బలిగొనే డ్రగ్ హింస మరొక ముఖ్య కారణమని ది గార్డియన్ పేర్కొంది.ఈ నిరసనల సమయంలో ముసుగు ధరించిన నిరసనకారుల చిన్న బృందం అధ్యక్షుడు క్లాడియా షైన్‌బమ్ నివసించే నేషనల్ ప్యాలెస్ చుట్టూ ఉన్న కంచెలను బద్దలుకొట్టారు. దీంతో ఆందోళనకారులను పోలీసులు చిధ్రం చేశారు.ఆ తర్వాత, భాష్ప వాయువును ప్రయోగించినట్లు అల్ జజీరా తెలిపింది.ఈ ఘర్షణల్లో 100 మంది పోలీసు అధికారులు గాయపడ్డారని, ఇందులో 40 మంది చికిత్స కోసం ఆసుపత్రిలో చేరారని అధికారులు చెప్పారు. అలాగే ఈ ఘర్షణల్లో పౌరులు సైతం గాయపడ్డారు. సుమారు 20 మంది గాయపడినట్లు వాజ్క్వెజ్ తెలిపారు. అదే విధంగా పబ్లిక్ సేఫ్టీ సెక్రటరీ 20 మందిని అరెస్టు చేశారని తెలిపారు.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *