అమ్మో! ఐరన్ బాక్స్‌లో బంగారం… అధికారులు స్టన్!

సాక్షి డిజిటల్ న్యూస్ :అక్రమ రవాణాపై అధికారులు ఎంత నిఘా పెట్టినా ఎదో రూపంలో అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు. తాజాగా శంషాబాద్ విమానాశ్రయంలో భారీ బంగారాన్ని తరలిస్తున్న ఓ వ్యక్తిని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. అతని వద్ద నుంచి దాదాపు కోటిన్నర  రూపాయిల విలువైన బంగారాన్ని స్వాధినం చేసుకున్నారు. ఐరన్ బాక్స్‌లో 11 గోల్డ్ ముక్కలను పెట్టి అక్రమం తరలిస్తూ.. అధికారుల తనిఖీల్లో అడ్డంగా దొరికిపోయాడు. సీజ్ చేసిన బంగారం విలువ మార్కెట్‌లో దాదాపు రూ. కోటిన్నర ఉంటుంది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 14న గ్రీన్ ఛానల్ దాటిన తర్వాత షార్జా నుంచి వచ్చిన ఓ ప్యాసింజర్ శంషాబాద్ ఎయిర్‌పోర్టులోని ఇంటర్నేషనల్‌ అరైవల్‌లో అనుమాస్పదంగా కనిపించడంతో.. అధికారులు అడ్డుకుని తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో భాగంగా.. అతని లగేజీలో ఉన్న ఐరన్ బాక్స్ విప్పి చూడగా.. అందులో విదేశీ గుర్తు ఉన్న బంగారు కడ్డీలు 11 లభ్యమయ్యాయి. అతని అదుపులోకి తీసుకుని విచారించగా.. దీనివెనుక ఏపీలోని వైఎస్సార్ జిల్లా, ప్రొద్దుటూరు స్మగ్లింగ్ గ్యాంగ్ ఉన్నట్లు అధికారులు గుర్తించారు. గత రెండు రోజుల క్రితం (శనివారం) ఓ వ్యక్తిని కూడా అధికారులు అరెస్ట్ చేశారు.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *