ఇథియోపియాలో అగ్నిపర్వత విస్ఫోటనం; విమానయాన సంస్థలు అప్రమత్తం

సాక్షి డిజిటల్ న్యూస్ : ఆఫ్రికా దేశమైన ఈశాన్య ప్రాంతమైన ఇథియోపియాలో హేలీ గుబ్బి అగ్నిపర్వతం ఒక్కసారిగా బద్ధలైపోయింది. ఈ విస్పోటనం సుమారు 10 వేల సంవత్సరాల్లో పేలడం ఇదే తొలిసారి. ఈ విస్ఫోటం కారణంగా.. 15 కి.మీ పెద్ద ఎత్తున బూడిదతో పాటు  దట్టమైన పొగలు వెలువడుతున్నాయి. ఇవి ఆకాశంలో వేల మీటర్ల ఎత్తుకు చేరుకోవడంతో.. విమాన రాకపోకలపై భారీ ప్రభావం పడుతున్నట్లు సమాచారం. నిన్న( సోమవారం) కేరళలోని కన్నూర్‌ నుంచి అబుధాబీకి బయల్దేరిన విమానంను మార్గంమధ్యలో అహ్మదాబాద్‌కు దారిమళ్లించారు. ఇక, అగ్నిపర్వతం నుంచి వెలువడుతున్న దట్టమైన బూడిద పొగ మేఘాలు, ఒమన్, అరేబియా సముద్రం, పాకిస్తాన్ మీదుగా ఉత్తర భారత్‌ విస్తరించే అవకాశం ఉందనే అంచనాలు వెస్తున్నారు. ఈ నేపథ్యంలో.. భారత్ నుంచి గల్ఫ్ యూరప్ దేశాలకు వెళ్లాల్సిన విమాన సర్వీసులు రద్దయ్యాయి. మరికొన్ని విమానాలను దారి మళ్లించారు.  ఉత్తరాది రాష్ట్రాల మీదుగా ఈ దట్టమైన బూడిద పొగ మేఘాలు చైనా వరకు విస్తరించవచ్చని అంతర్జాతీయ వాతావరణ శాఖ విభాగాలు అంచనా వేశాయి. ఈ క్రమంలో బూదిత మేఘాలు కమ్ముకున్న ప్రాంతాల నుంచి ప్రయాణించవద్దంటూ విమానాయాన సంస్థలకు డీజీసీఏ అత్యవసర సూచనలు జారీ చేసింది. ఇథియోపియాలోని అఫర్‌ రీజియన్‌లో ఉన్న హేలీ గుబ్బి అగ్నిపర్వతం గత 10 వేల సంవత్సరాల్లో పేలినట్లు రికార్డులు లేవు. అయితే  తాజాగా ఈ అగ్నిపర్వతం విస్ఫోటనం చెందడాన్ని స్థానిక చరిత్రలో అత్యంత అసాధారణమైన ఘటనల్లో ఒకటిగా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ అగ్నిపర్వతం మారుమూల ప్రాంతం ఉండడంతో.. ప్రాణ, ఆస్తి నష్టం వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *