ప్రేమ వివాహం చేసుకున్న యువతిపై కుటుంబ సభ్యుల దారుణ చర్య: పోలీస్ దర్యాప్తు

సాక్షి డిజిటల్ న్యూస్ :జగిత్యాల జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. తన కుమార్తెను ప్రేమ వివాహం చేసుకున్నాడనే కోపంతో యువతి కుటుంబ సభ్యులు యువకుడి ఇంటిపై దాడి చేశారు. యువతి బంధువుల దాడిలో తీవ్రంగా గాయపడిన యువకుడి ప్రస్తుతం హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని అబ్బాయి కుటుంబ సభ్యులపై అమ్మాయి కుటుంబ సభ్యులు కర్రలతో దాడి చేసి యువతిని తీసకెళ్లిన ఘటన జగిత్యాల జిల్లాలో వెలుగు చూసింది. మల్యాల మండల కేంద్రానికి చెందిన నల్ల ముత్తు కుమార్.. గుంటూరు జిల్లా మాచర్ల గ్రామానికి చెందిన సోముల మాధవి గత కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇటీవలే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని ఇద్దరి ఇంటి పెద్దలకు చెప్పారు. కానీ ఈ పెళ్లికి అమ్మాయి పేరెంట్స్ ఒప్పుకోలేదు. దీంతో కొండగట్టు ఆంజనేయస్వామి సన్నిదిలో గత వారం రోజుల క్రితం వివాహం చేసుకున్నారు. విషయం తెలిసిన అమ్మాయి పేరెంట్స్ తో పాటు.. కుటుంబ సభ్యులు కొంతమంది అబ్బాయి ఇంటికి వచ్చి గొడవ చేశారు.దీంతో అబ్బాయి కుటుంబ సభ్యులు మల్యాల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఇరు కుటుంబ సభ్యులను పీఎస్‌కు పిలిపించి కౌన్సెలింగ్ నిర్వహించి పంపించారు. అయితే ఎలగైనా తమ కుమార్తెను తీసుకెళ్లాలని నిర్ణయించుకున్న యువతి కుటుంబ సభ్యులు.. సోమవారం అబ్బాయి ఇంటిపై క్రరలతో దాడి చేసి అమ్మాయిని తీసుకెళ్లారు. యువతి కుటుంబ సభ్యుల దాడిలో అబ్బాయి తల్లిదండ్రులు, పలువురు గాయపడ్డారు.గమనించిన స్థానికులు వారిని వెంటనే స్థానిక హాస్పిటల్‌కు తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. యువతి కుటుంబ సభ్యుల నుంచి ఆమెకు ప్రాణహాని ఉందని.. అమ్మాయిని తమకు అప్పగించాలని యువకుడి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. దాంతో పాటు వారు తమపై మళ్లీ దాడి చేసే అవకాశం ఉందని.. తమకు రక్షణ కల్పించాలని ముత్తు కుటుంబ సభ్యులు కోరుతున్నారు.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *