భర్తపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఇద్దరు భార్యలు_పోలీస్ దర్యాప్తు ప్రారంభం

సాక్షి డిజిటల్ న్యూస్ :భర్త పెడుతున్న హింసను భరిస్తూ ఎన్నో ఏళ్లుగా అతడితోనే సంసారం చేశారు ఇద్దరు భార్యలు. వారు చిత్రహింసలను భరిస్తున్న కొద్దీ భర్త మరింత హింసిస్తున్నాడు. అయితే, ఓపికకు కూడా ఓ హద్దు ఉంటుంది.భర్త మళ్లీ చిత్రహింసలకు గురి చేయడంతో ఆ ఇద్దరు మహిళల ఓపిక నశించింది. భర్తపై పెట్రోలు పోసి తగలబెట్టారు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లాలోని బీమ్‌గల్ మండలం దేవక్కపేటలో చోటుచేసుకుంది. మలవాత్ మోహన్ (42) తరచూ మద్యం తాగి తన ఇద్దరు భార్యలు కవిత, సంగీతను కొట్టేవాడు.ఆదివారం మరోసారి గొడవ పెట్టుకుని ఇద్దరు భార్యలను ఒక గదిలో పెట్టి తాళం వేశాడు. దీంతో సోమవారం ఉదయం పెట్రోల్ తెచ్చి మోహన్‌పై పోసి నిప్పుపెట్టారు. మోహన్ అక్కడికక్కడే చనిపోయాడు. సునీత, కవిత ఇంటి నుంచి పారిపోయారు. మోహన్ సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఆ ఇద్దరు మహిళలపై కేసు నమోదు చేసి, దర్యాప్తు కొనసాగిస్తున్నారు. సీఐ సత్యనారాయణతో పాటు ఎస్సై సందీప్‌‌ ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. కవిత, సంగీత కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *