ఎప్పుడూ చేయని రీతిలో కొత్త టచ్—ప్రేక్షకులు ఎక్కువగా డిమాండ్ చేస్తున్నారు

సాక్షి డిజిటల్ న్యూస్ :విజయ్ దేవరకొండ.. ఈ స్టార్ కి ఆడియన్స్ లో ఉన్న క్రేజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. అర్జున్ రెడ్డి సినిమాతో తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని క్రియేట్ చేసుకున్నాడు. ఆతరువాత వచ్చిన గీత గోవిందం సినిమాతో మరో బ్లాక్ బస్టర్ ను అందుకొని స్టార్ హీరోల లిస్టులోకి చేరిపోయాడు. ఆ తరువాత కూడా వరుసగా క్రేజీ ప్రాజెక్టుల్లో అవకాశం దక్కించుకున్నాడు. కానీ, విజయం మాత్రం వరించడం లేదు. గీత గోవిందం విజయ్ దేవరకొండ అందుకున్న చివరి బ్లాక్ బస్టర్. ఆతరువాత డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫెమస్ లవర్, లైగర్, ఖుషి, ఫ్యామిలీ స్టార్, కింగ్డమ్ లాంటి సినిమాలు చేశాడు. కానీ, వీటిలో ఒక్క సినిమా కూడా బ్లాక్ బస్టర్ ఇవ్వలేదు.అయినా కూడా బాక్సాఫీస్ మీద తన యుద్దాన్ని మాత్రం ఆపడంలేదు విజయ్ దేవరకొండ. ప్రస్తుతం ఆయన చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. వాటిలో ఒకటి దర్శకుడు రవి కిరణ్ కోలాతో చేస్తున్న రౌడీ జనార్ధన కాగా.. రెండవది డైరెక్టర్ రాహుల్ రాంకృత్యన్ తో చేస్తున్న పాన్ ఇండియా మూవీ. ఈ రెండు దేనికదే ప్రత్యేకం. ఒకటి రా అండ్ రస్టిక్ కంటెంట్ తో రానుంది. మరికొటి పీరియాడికల్ కంటెంట్ తో తెరకెక్కుతోంది. ఈ రెండు సినిమాలపై చాలా ఆశలే పెట్టుకున్నాడు విజయ్. అందుకే ఈ రెండు సినిమాల కోసం కెరీర్ లో ఎప్పుడు పడనంతగా కష్టపడుతున్నాడు. తాజాగా ఈ రెండు సినిమాల గురించి ఒక ఆసక్తికర కామెంట్స్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు విజయ్ దేవరకొండ. “కెరీర్ లో ఫస్ట్ టైం ఒకేసారి 2 సినిమాల షూటింగ్స్ లో పాల్గొంటున్నాను. ఈ రెండు సినిమాలు నా నుంచి చాలా డిమాండ్ చేస్తున్నాయి. డైరెక్టర్ నా ప్రాణాలు తోడేస్తున్నారు”అంటూ రాసుకొచ్చాడు. దీంతో విజయ్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ పోస్ట్ చూసిన విజయ్ ఫ్యాన్స్ రకరకాలుగా రియాక్ట్ అవుతున్నారు. ను పడుతున్న కష్టానికి తగిన ఫలితం ఖచ్చితంగా దక్కుతుంది అన్నా. ఈ రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ అవడం ఖాయం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ రెండు సినిమాలు కూడా 2026లోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. మరి విజయ్ దేవరకొండ చాలా ఆశలు పెట్టుకున్న ఈ రెండు సినిమాలు ఆయనకు ఎలాంటి రిజల్ట్ ను ఇస్తాయి అనేది చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *