ప్రభుత్వ డబ్బు వినియోగంపై పరిశీలన: లోకేష్ ప్రత్యేక విమాన ప్రయాణాలు

సాక్షి డిజిటల్ న్యూస్ :ఏపీ మంత్రి నారా లోకేష్ విమాన ప్రయాణాలపై వచ్చిన ఆరోపణలకు స్పష్టత వచ్చింది. ఆర్టీఐ ద్వారా వెల్లడైన వివరాల ప్రకారం, మంత్రి లోకేష్ తన 77 ప్రత్యేక విమాన ప్రయాణాలకు ప్రభుత్వ డబ్బును ఖర్చు చేయలేదు. విద్య, ఐటీ శాఖల మంత్రి తన సొంత నిధులతోనే ఈ ప్రయాణాలు చేశారని అధికారులు స్పష్టం చేశారు. ఈ మేరకు టీడీపీ ఆర్టీఐ ద్వారా సేకరించిన ఆ వివరాలను వెల్లడించింది. ఏపీ మంత్రి నారా లోకేష్ విమాన ప్రయాణాల కోసం ప్రభుత్వం డబ్బుల్ని ఖర్చు చేస్తున్నారా?. లోకేష్ మొత్తం 77 సార్లు ప్రత్యేక విమానంలో ప్రయాణం చేశారా?. ఈ విమాన ఖర్చులన్ని ప్రభుత్వానివేనా?. కొద్దిరోజులుగా జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే మంత్రి లోకేష్ విమాన ప్రయాణాలకు సంబంధించి క్లారిటీ వచ్చింది. ఆర్టీఐ కార్యకర్త సురేశ్ బాబు సమాచార హక్కు చట్టం కింద వివరాలు కోరగా.. లోకేష్ విమాన ప్రయాణాలపై ప్రభుత్వ అధికారులు స్పష్టత ఇచ్చారు. స్పెషల్, రెగ్యులర్ విమానాల్లో ఆయన ప్రయాణాలకు తన సొంత నిధులను ఉపయోగించుకున్నారని అధికారులు తెలిపారు. ఈ మేరకు టీడీపీ మంత్రి లోకేష్ విమాన ప్రయాణాల వివాదంపై కొన్ని వివరాలను వెల్లడించింది.కూటమి అధికారంలోకి వచ్చాక మంత్రి లోకేష్ తన విమాన ప్రయాణాలకు ప్రభుత్వ డబ్బు వాడలేదని ఆర్టీఐ ద్వారా తేలింది. లోకేష్ తన సొంత డబ్బుతోనే ప్రయాణాలు చేశారని.. అధికారిక పర్యటనలకు వెళ్లినప్పుడు కూడా లోకేశ్ తన సొంత డబ్బులు ఖర్చు పెట్టారని స్వయంగా అధికారులే క్లారిటీ ఇచ్చారని టీడీపీ తెలిపింది. ఆర్టీఐ కార్యకర్త సురేశ్ బాబు సమాచార హక్కు చట్టం కింద మంత్రి లోకేష్ విమాన ప్రయాణాలకు సంబంధించిన వివరాలు కోరారు. మంత్రి లోకేశ్ పర్యటనలకు ఎంత ఖర్చు అయిందని ఆయన అడిగారు. దీనికి స్పందిస్తూ, ఆయా శాఖలు మంత్రి లోకేష్ పర్యటనలకు ప్రభుత్వ సొమ్ము ఏమాత్రం వాడలేదని స్పష్టం చేశాయి.’విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ 77 సార్లు ప్రత్యేక విమానంలో తిరుగుతూ, హైదరాబాదులో సేదతీరుతూ ఉన్నారని ఓ పత్రికలో వేసినవి పచ్చి అబద్ధాలని సమాచార హక్కు చట్టం ద్వారా వెల్లడైంది. ఇందులో ఒక్కటి కూడా వ్యక్తిగత పర్యటన లేదు, అయినప్పటికీ ఈ పర్యటనలకు సొంత సొమ్మును మంత్రి నారా లోకేష్ వెచ్చిస్తున్నారు. ఈ పర్యటనల కోసం తాను నిర్వహించే మానవ వనరులు, ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఆర్టీజీ శాఖల నుంచి ఒక్క రూపాయి కూడా మంత్రి నారా లోకేష్ తీసుకోలేదని సమాచార హక్కు ఉద్యమ కార్యకర్త వేసిన అర్జీ ద్వారా వెల్లడైంది’ అంటూ టీడీపీ ట్వీట్ చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *