ఎన్నికల నామినేషన్లు ఓపెన్—పత్రం ఫీల్ చెక్ చేసుకున్నారా

సాక్షి డిజిటల్ న్యూస్ :తెలంగాణలో తొలివిడత పంచాయతీ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. నేటి నుంచి ఈనెల 29 వరకు నామపత్రాలు దాఖలు చేసుకునే అవకాశం ఉంది. ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు సమర్పించాల్సి ఉంటుంది. ఈనెల 30న నామినేషన్ల పరిశీలన, డిసెంబర్ 3 వరకు ఉపసంహరణ గడువు ఉంది. తొలిదశలో 4,236 గ్రామాలు, 37,450 వార్డుల్లో పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 3న పోటీలో ఉన్న అభ్యర్థుల వివరాలు ప్రకటించున్నారు. డిసెంబర్ 11న పోలింగ్ ఉండగా, అదేరోజు మధ్యాహ్నం ఫలితాలు వెల్లడించనున్నారు. అయితే, రాష్ట్ర ఎన్నికల సంఘం పంచాయతీ ఎన్నికల విధి విధానాలను విడుదల చేసింది. సర్పంచ్, వార్డు స్థానాలకు పోటీచేసే అభ్యర్థుల వయస్సు 21 ఏళ్లు నిండి ఉండాలి. అభ్యర్థులు అదే గ్రామంలో ఓటరుగా నమోదై ఉండాలి. ప్రభుత్వ,  స్థానిక సంస్థల ఉద్యోగులు నామినేషన్‌కు ముందే రాజీనామా ఆమోదం పొందాల్సి ఉంటుంది. ఒక వ్యక్తి గరిష్టంగా 4 నామినేషన్లు దాఖలు చేసుకునే అవకాశం ఉంటుంది. కుల ధ్రువీకరణ పత్రం జతపరచడంతోపాటు.. సర్పంచ్ అభ్యర్థులకు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రూ.1000, ఇతరులకు రూ.2,000 రుసుముగా నిర్ణయించారు. అలాగే, నామినేషన్ వేసే ముందు పత్రంలో వీటిని సరి చూసుకోవాల్సి ఉంటుంది. తొలుత వయస్సు 21 ఏళ్లు నిండడంతో పాటు అదే గ్రామానికి చెందిన వ్యక్తిగా ఉండాలి. సంబధిత ఓటరు లిస్టులో ఓటరుగా నమోదై ఉండాలి. అలాగే ఎస్సీ లేదా ఎస్టీ లేదా బీసీ వారైతే కులం సర్టిఫికెట్ జత పరచాల్సి ఉంటుంది. దీంతో పాటు కొంత డిపాజిట్ నగదు చెల్లించాల్సి ఉంటుంది. ప్రధానంగా క్రైమ్ హిస్టరీ, ఆస్తులు, విద్యార్హతలతో కూడిన అఫిడవిటీ ఇద్దరు సాక్ష్యాలతో సంతకం పెట్టించి ఇవ్వాలి. అంతేకాకుండా, ఎన్నికలకు సంబంధించి ఎంత ఖర్చు వంటి వివరాలను డిక్లరేషన్ ఇవ్వాలి. ఏ స్థానం నుంచి పోటి చేస్తున్నారో ఆ స్థానం నుంచి ఓటరు మాత్రమే ప్రతిపాదకుడిగా ఉండాలి. ఇనామినేషన్ పత్రంలో పార్ట్ 1లో ప్రతిపాదకుని సంతకం, పార్ట్ 2లో అభ్యర్థి సంతకం, పార్ట్  3లో కూడా అభ్యర్ధి సంతకం, పార్ట్  4లో ఆర్ఓ సంతకం, పార్ట్  5(రిజెక్టెడ్ నామినేషన్ లిస్టు)లో ఆర్ఓ సంతకం, పార్ట్  6 (రిసిప్ట్ )లో ఆర్ఓ సంతకం ఉండాలి.  దీంతో పాటు అఫిడవిటీలో ఇద్దరు సాక్షుల సంతకం, అభ్యర్థి సంతకం ఉండాలి. చివరగా ఎక్స్‌ఫెండిచర్‌ డిక్లరేషన్‌లో అభ్యర్ధి సంతకం ఉండాలని సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *