వైసీపీ నేత కుటుంబం దారుణ పరిణామం-తల్లి కన్నుమూత, తండ్రికి గాయాలు

సాక్షి డిజిటల్ న్యూస్ :ఏపీలోని శ్రీకాళహస్తి వైసీపీ మండల అధ్యక్షుడు చెవిరెడ్డి మధుసూదన్ రెడ్డి ఇంటిపై దాడి సంచలనం రేపింది.  మధుసూదన్ రెడ్డి తల్లిదండ్రులపై గుర్తు తెలియని వ్యక్తుల దాడి చేశారు. ఈ దాడిలో మధుసూదన్ రెడ్డి తల్లి మరణించగా.. తండ్రి మహదేవ రెడ్డి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మధుసూదన్ రెడ్డి తల్లిదండ్రులపై జరిగిన దాడి రాజకీయంగా కలకలం రేపుతోంది. ఈ దాడికి పాల్పడింది దొంగతనానికి వచ్చిన వాళ్ల లేదా వేరేవాళ్ల అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన విషయం తెలిసిన వెంటనే వైసీపీ స్థానిక నేత భూమన కరుణాకర్ రెడ్డి తిరుపతిలోని మధుసూదన రెడ్డి ఇంటికి వెళ్లారు. మధుసూదన రెడ్డి తల్లిదండ్రులపై జరిగిన దాడిన ఆయన తీవ్రంగా ఖండించారు. అయితే ఈ దాడి వార్త తెలుసుకున్న వైసీపీ శ్రేణులు ఆందోళనలకు దిగుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *