“నాన్న ఆలస్యం అయినా, అతని నిర్ణయం నన్ను స్టార్ చేసింది”: కృతి శెట్టి

సాక్షి డిజిటల్ న్యూస్ :తొలి సినిమాకే ఓవర్‌నైట్ స్టార్‌గా మారిన నటి కృతి శెట్టి.  ‘ఉప్పెన’ సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన ఈ చిన్నది తొలిసినిమాతోనే మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కృతి.. తాను సిని ఇండస్ట్రీలోని ఎలా అడుగుపెట్టారో అభిమానులతో పంచుకున్నారు. ఉప్పెన సినిమా తర్వాత వరుస ఆఫర్లతో దూసుకెళ్లిన కృతి శెట్టి.. ప్రస్తుతం ఫ్లాపులతో సతమతమవుతూ తమిళ సినిమాలపై దృష్టి పెట్టారు. ఇంటర్వ్యూలో కృతి మాట్లాడుతూ…‘ఓ కమర్షియల్ యాడ్ ఆడిషన్ కోసం స్టూడియోకి వెళ్లాను. ఆడిషన్ తర్వాత నన్ను తీసుకెళ్లడానికి నాన్న రావాడం కాస్త ఆలస్యమైంది. దీంతో పక్కనే ఉన్న మరో స్టూడియోలోకి వెళ్లగా.. అక్కడ ఒక సినిమా ఆడిషన్స్ జరుగుతున్నాయి.  అక్కడ ఉన్న యూనిట్ సభ్యులు నన్ను చూసి సినిమాల్లో నటించే ఇంట్రస్ట్ ఉందా ..? అని అడిగారు. ఆ సమయంలో నేడు ఏం చెప్పాలో తెలియక మా అమ్మ నంబర్ ఇచ్చి అక్కడి నుంచి వచ్చేశాను. వాళ్లు మా అమ్మకు ఫోన్ చేసి ఆడిషన్‌కు రమ్మని పిలిచారు. అలా ‘ఉప్పెన’ సినిమాలో హీరోయిన్‌గా నటించే అవకాశం వచ్చింది’ అని వివరించారు.ఇక కృతి శెట్టి నటించిన ‘ఉప్పెన’ బ్లాక్‌ బస్టర్ హిట్ అందుకుంది. దీంతో ఆమెకు  అవకాశాలు వెల్లువెత్తాయి. నాచురల్ స్టార్ నానితో ‘శ్యామ్ సింగ రాయ్’, అక్కినేని నాగచైతన్యతో ‘బంగార్రాజు’ సినిమాల్లో నటించారు. ఆ సినిమాకు పెద్దగా హిట్ అందుకోకపోయినా పర్వాలేదనిపించాయి. ఇక, ఆ తర్వాత రామ్‌ పోతినేనితో ‘ది వారియర్’, నితీన్‌తో ‘మాచర్ల నియోజకవర్గం’, ‘కస్టడీ’, ‘మనమే’ వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. దీంతో ఆమె సిని కెరీన్ గ్రాఫ్ ఒక్కసారిగా పడిపోయింది. వరుస ఫ్లాపుల తర్వాత కొంతకాలం గ్యాప్ తీసుకున్నారు కృతి. ప్రస్తుతం కోలివుడ్‌లో రెండు సినిమాలతో బిజీగా ఉన్నారు. ‘వా వాతియార్’, ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ సినిమాల్లో కృతి నటిస్తోంది. ప్రస్తుతం ఆమె నటిస్తున్న సినిమాలపై తమిళ పరిశ్రమలో మంచి అంచనాలున్నాయి. ఈ చిత్రాలతోనైనా కృతి శెట్టి ఆశలన్నీ పెట్టుకున్నారు. ఇక ఈ సినిమాలతోనైనా ఆమె విజయాల బాట పడుతుందేమోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *