మేడారం జాతరకు జాతీయ హోదా ఇవ్వలేమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం!

సాక్షి డిజిటల్ న్యూస్ : ఆసియాలోనే అతిపెద్దదైన మేడారం జాతరకు జాతీయ హోదా ఇవ్వలేమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. ఈ సందర్భంగా హనుమకొండ వేయి స్తంభాల గుడిని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా ‎మేడారం జాతర జాతీయ హోదాపై ఆయన స్పందించారు. మేడారం జాతరకు జాతీయ హోదా కల్పించలేమంటూ స్పష్టం చేశారు. ఇప్పటివరకు ఏ జాతరకు జాతీయ హోదా ఇవ్వలేదన్నారు. అనంతరం ‎ రామప్ప ఆలయానికి రూ.155 కోట్లు, భద్రాచలం ఆలయానికి రూ.50 కోట్లు ఇచ్చామని గుర్తుచేశారు. ప్రసాద్ స్కీంలో భాగంగా రామప్ప ఆలయంతోపాటు భద్రాచలం, జోగులాంబ ఆలయాన్ని అభివృద్ధి చేస్తున్నామన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *