గిన్నిస్ రికార్డుల్లో చోటు దక్కించిన మినీ గేదె

సాక్షి డిజిటల్ న్యూస్ : మహారాష్ట్రలోని మాలావాడి గ్రామంలోని ప్రశాంత వీధుల్లో ఒక ప్రత్యేక అతిథి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.. రాధ అనే ఒక చిన్న గేదె ఇప్పుడు ప్రపంచంలోనే అతి చిన్న గేదెగా ప్రసిద్ధి చెందింది. ఈ రాధనను చూడటానికి సుదూర ప్రాంతాల నుండి కూడా ప్రజలు తండోపతండాలుగా తరలి వస్తున్నారు. రాధను చూసేందుకు వస్తున్న సందర్శకులు, స్థానికులతో గ్రామంలో పండగ వాతావరణం నెలకొంది.రాధ ఎత్తు కేవలం 2 అడుగుల 8 అంగుళాలు. త్రింబక్ బోరాటే పొలంలో నివసిస్తుంది. ఇది ముర్రా హైబ్రిడ్ గేదె. సాధారణ గేదెలు 8 నుండి 9 అడుగుల పొడవు ఉండగా రాధ చాలా చిన్నది.త్రింబక్ బోరాటే కుమారుడు అనికేత్ రాధను ఒక వ్యవసాయ ప్రదర్శనకు తీసుకెళ్లాడు. డిసెంబర్ 21న రాధ మొదటిసారిగా ఒక కార్యక్రమంలో పాల్గొంది. అప్పటి నుండి 13 కి పైగా ప్రదర్శనలకు హాజరైంది. ఆమె అందం, ప్రశాంతమైన స్వభావం ప్రజల హృదయాలను గెలుచుకుంది.నివేదికల ప్రకారం, ఈ చిన్న గేదె రాధ పేరు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకుంది. దీంతో ఆ రైతు కుటుంబీకులు ఆనందంలో మునిగిపోయారు. రాధ ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో భారతదేశానికి కీర్తిని తెస్తుందని, ప్రపంచవ్యాప్తంగా జంతుప్రేమికుల హృదయాలను గెలుచుకుంటుందని అనికేత్ చెప్పారు.ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన గేదె గురించి చెప్పాలంటే, థాయిలాండ్‌లోని ప్రసిద్ధ గేదె, కింగ్ కాంగ్ 6 అడుగుల కంటే ఎక్కువ పొడవు ఉంటుంది. ఇప్పుడు రాధ ఆ రికార్డ్‌ని బ్రేక్‌ చేసింది. కింగ్‌కాంగ్‌ కంటే దాదాపు 4 అడుగుల ఎత్తు తక్కువగా ఉంటుంది. కానీ, గొప్ప గుర్తింపు సాధించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *