సిగపట్ల వివాదం.. యువతుల మధ్య మాటల యుద్ధం!

సాక్షి డిజిటల్ న్యూస్ : ఉత్తరప్రదేశ్ నోయిడాలోని ఓ ప్రైవేట్ విశ్వవిద్యాలయంలో ఇద్దరు విద్యార్థినుల మధ్య ఉన్నట్లుండి గొడవ మొదలైంది. అది కాస్త తీవ్రరూపం దాల్చి ఒకరినొకరు జుట్లు పట్టుకుని కొట్టుకునే వరకూ చేరుకుంది. కాలేజీ ప్రాంగణంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియో ప్రకారం.. ఎర్రటి చుడీదార్ వేసుకున్న ఓ అమ్మాయి.. తనకు కాస్త దూరంలో కూర్చుని ఉన్న మరో అమ్మాయితో ఏదో విషయమై కాసేపు మాట్లాడింది. ఇంతలో ఏం జరిగిందో ఏమో తెలియదు.. ఉన్నట్లుండి దూరంగా నిలబడిన అమ్మాయి ఒక్కసారిగా ముందుకు వచ్చి తను అప్పటివరకు మాట్లాడిన అమ్మాయిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అదే ఆవేశంలో ఆ అమ్మాయి జుట్టుని గట్టిగా పట్టేసుకుంది. దాంతో ఆ అమ్మాయి కూడా తిరిగి ఎదురుదాడి చేసేందుకు ముందుకు దూకింది. అలా ఒకరి జుట్లు ఒకరు పట్టుకుని పెద్దగా తిట్టుకోవడం మొదలుపెట్టారు. ఇంతలో అక్కడే ఉన్న వారి స్నేహితులు ఈ గొడవను ఆపేందుకు ప్రయత్నించారు. కానీ వారివల్లకాలేదు. దాంతో కాసేపు ఈ తతంగం అలాగే కొనసాగింది. అసలు ఆ ఇద్దరు ముందుగా ఏ విషయంపై మాట్లాడుకున్నారు.. ఆ తర్వాత కొట్టుకునే వరకు గొడవ ఎందుకు మొదలైంది అనేది క్లారిటీ లేదు కానీ.. ఈ వీడియో మాత్రం సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. వీడియోపై నెటిజన్లు తమదైనశైలిలో స్పందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *