“శబరిమల దేవాలయానికి పోటెత్తిన భక్తుల ధృడ విశ్వాసం: లక్షలమంది దర్శనం పొందారు!”

సాక్షి డిజిటల్ న్యూస్ :శబరిమల కొండలన్నీ అయ్యప్ప నామస్మరణతో మారుమోగుతున్నాయి. శబరి గిరులన్నీ అయ్యప్ప స్వామి భక్తులతో నిండిపోయాయి. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులందరూ తండోపతండాలుగా తరలివస్తున్నారు. ఈ సీజన్‌లో రికార్డు స్థాయిలో భక్తులు అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారు. శబరిమలలో నవంబర్ 16న మండల పూజా మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. డిసెంబర్ 27వ తేదీతో ముగియనున్నాయి. అయితే, శబరిమల అయ్యప్ప స్వామిని ఈ సీజన్లో ఇప్పటి వరకు 25లక్షల మందికిపైగా దర్శించుకున్నారు. ఏడీజీపీ ఎస్ శ్రీజిత్ వివరాలు వెల్లడించారు. గతేడాదితో పోలిస్తే ఇక్కడికి వస్తున్న భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగిందట. 2024 సంవత్సరంలో మొత్తం 21లక్షల మంది అయ్యప్ప స్వామి దర్శనానికి వచ్చారని, ఈ ఏడాది ఇప్పటి వరకు 25లక్షల మందికిపైగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు శ్రీజత్ తెలిపారు. ఈనెల చివరి వరకు భక్తులు రద్దీ మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *