నూతన గ్రామ పంచాయతి సర్పంచ్ ప్రమాణ శ్రీ కార్యంలో మంత్రి అడ్లూరి

సాక్షి డిజిటల్ డిసెంబర్ 23 ధర్మపురి నియోజకవర్గ రిపోర్టార్ అజయ్ :

ఎండపెల్లి మండలం కొత్తపేట గ్రామంలో నూతనంగా ఎన్నికైన గ్రామ సర్పంచ్ మహేందర్ రెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి శ్రీ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి నూతన గ్రామ సర్పంచ్ జీ మహేందర్ రెడ్డి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా పారదర్శకంగా, బాధ్యతాయుతంగా పాలన సాగించాలని సూచించారు.మంత్రి మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి నాయకత్వంలో గ్రామాల సమగ్ర అభివృద్ధి దిశగా ముందుకెళ్తోందని తెలిపారు. గ్రామ అభివృద్ధికి అవసరమైన నిధులు, పథకాలను ప్రభుత్వం ద్వారా సమకూర్చి, త్రాగునీరు, విద్యుత్, రహదారులు, పారిశుధ్యం, డ్రైనేజీ, వీధిదీపాలు వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తామని స్పష్టం చేశారు.అదేవిధంగా పేదల సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలను గ్రామస్థులందరికీ అందేలా చూడాలని సర్పంచ్‌కు సూచించారు. గ్రామంలోని యువత, మహిళలు, రైతులు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకొని స్వావలంబన దిశగా ముందుకు సాగాలని కోరారు.కొత్తూరు గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామ ప్రజలు సమిష్టిగా కృషి చేయాలని మంత్రి గారు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు,పార్టీ నాయకులు,మండల అధికారులు,గ్రామ పెద్దలు, యువకులు,మహిళలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *