ఫ్యాన్స్‌కి హిట్ ఖచ్చితమే! మాస్ జాతర థియేటర్స్‌లో సందడికి సిద్ధం!

సాక్షి డిజిటల్ న్యూస్ :మాస్ మహారాజ రవితేజ నటిస్తున్న లేటెస్ట్ మూవీ మాస్ జాతర. ఈ సినిమా కోసం రవితేజ అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. నేడు ఈ సినిమా విడుదల కావాల్సింది.. కానీ రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమా బాహుబలి ఎపిక్ పేరుతో రీ రిలీజ్ అవ్వడంతో మాస్ జాతర సినిమా రిలీజ్ ను వాయిదా వేశారు. ఫైనల్ గా ఈ సినిమాను రేపు నవంబర్ 1న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు. నేడు( 31 అక్టోబర్ )న సాయంత్రం ప్రీమియర్స్ మొదలు కానున్నాయి.  గత కొంతకాలంగా విభిన్నమైన కథలను ఎంచుకుంటూ వస్తున్న రవితేజ.. ఇప్పుడు మరోసారి తన మాస్ ఆడియన్స్ ను మెప్పించే కథతో రెడీ అయ్యారు. రైల్వే పోలీస్ అధికారిగా రవితేజ తనదైన శైలిలో కనిపించి మెప్పించారు. తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలకు రచయితగా పనిచేసిన భాను భోగవరపు, ‘మాస్ జాతర’ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.ఈ సినిమాలో హీరోయిన్ గా శ్రీలీల నటిస్తుంది. ఇక ఈ సినిమా పై ఇప్పటికే అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవలే ఈ సినిమా నుంచి ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ ట్రైలర్ సినిమా పై అంచనాలను భారీగా పెంచేసింది. ధమాకా తర్వాత రవితేజ శ్రీలీల కలిసి నటిస్తున్న సినిమాకావడంతో ధమాకాను మించి ఈ సినిమా విజయం సాదిస్తుందని అంటున్నారు అభిమానులు. ఇప్పటికే ఈ సినిమా గురించి సెన్సార్ నుంచి వచ్చిన టాక్ ప్రకారం సినిమా అదిరిపోతుందని అంటున్నారు. ఇక ఈ సినిమా కోసం ఈగర్ గా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. ఇప్పటికే ఈ సినిమాకు భారీగా బుకింగ్స్ అయ్యాయని తెలుస్తుంది. ఈ సినిమా  ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *