“ఒక్కడిని దోషిగా చేయకండి” – విజయ్ సభ ఘటనపై అజిత్ ఎమోషనల్!

సాక్షి డిజిటల్ న్యూస్ :కోలీవుడ్‌లో విజయ్, అజిత్ మధ్య టాప్ పొజిషన్ గురించి ఎన్నో ఏళ్లుగా ఆధిపత్య పోరు నడుస్తోంది. విజయ్‌ని అభిమానులు ముద్దుగా ‘తలపతి’ అని పిలిస్తే, అజిత్‌ని ‘తలైవా’ అని పిలుచుకుంటారు. ఇలా పేరు గురించి కూడా అభిమానుల మధ్య వైరం చాలా ఏళ్లుగా ఉంది. ఈ ఇద్దరూ సినిమాల్లో కూడా ఒకరిపై ఒకరు పంచులు వేసుకోవడం చాలా కామన్. అయితే సినిమాలు వేరు, రియల్ లైఫ్ వేరు. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన విజయ్‌కి అజిత్ సపోర్ట్ ఇవ్వడం, కోలీవుడ్‌లో హాట్ టాపిక్ అయ్యింది..2025, సెప్టెంబర్ 27న విజయ్ స్థాపించిన టీవీకే పార్టీ పొలిటికల్ ర్యాలీలో తొక్కిసలాట జరిగి 41 మంది ప్రాణాలు కోల్పోగా, వందలాది మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ తొక్కిసలాట కారణంగా అప్పటిదాకా విజయ్‌కి సపోర్ట్ చేసిన వాళ్లు కూడా విమర్శలు చేయడం మొదలెట్టారు. విజయ్, ఇంతమంది అమాయకుల ప్రాణాలు పోవడానికి కారణమయ్యాడంటూ తిట్టడం మొదలెట్టారు.. తాజాగా అజిత్ దీనిపైన స్పందించాడు. ‘జనాలకు ఎవ్వరైనా వస్తున్నాడంటే ఎగబడి వెళ్లడం అలవాటుగా మారిపోయింది. రాజకీయ నాయకులు కూడా జనాలు పోగేసి, తమ పలుకుబడి చూపించాలని అనుకుంటున్నారు. దీనికి ఇకనైనా ముగింపు పలకాలి. నేను, ఎవ్వరినీ తప్పు పట్టాలని అనుకోవడం లేదు. కానీ తమిళనాడులో ఇలాంటి దారుణం జరిగిపోయింది. దీనికి ఏ ఒక్కరినో తప్పు బట్టడం కరెక్ట్ కాదు. మనందరం కూడా బాధ్యులమే! మీడియా కూడా దీనికి కారణమే.. ఓ సమాజంగా ఇలా గుంపుగా గుమిగూడితే జరిగే అనార్థాల గురించి కనీస విచక్షణ ఉండడం చాలా ముఖ్యం.. జనాల్లో చైతన్యం తేవాలి.. క్రికెట్ మ్యాచ్ చూడడానికి వేల సంఖ్యలో జనాలు వెళ్తారు. అయితే అక్కడ ఇలాంటివి జరగడం లేదు. థియేటర్లలో, సినిమా హీరోలను చూసేటప్పుడు మాత్రమే ఎందుకు ఇలా జరుగుతోంది. మేం అభిమానులకు ఇలా జరగాలని కోరుకోం.. అభిమానుల ప్రేమను మేం కోరుకుంటాం.. అందుకే రాత్రీ పగలు లేకుండా కుటుంబానికి దూరంగా ఉంటూ కష్టపడతాం… సెట్స్‌లో గాయపడతాం.. డిప్రెషన్‌లోకి వెళ్తాం, నిద్రలేని రాత్రులు ఎన్నో గడుపుతాం.. అంతా కూడా అభిమానుల కోసమే..అయితే అభిమానాన్ని చూపించడానికి పద్ధతులు వేరేగా ఉంటాయి. ఇలా మొదటి రోజు మొదటి షో సినిమా చూసేయాలి, థియేటర్ దగ్గర ఇంత మంది జనం గుమిగూడారు.. లాంటి విషయాలను మీడియా కూడా ఎంకరేజ్ చేయడం మానేయాలి.. ’ అంటూ కామెంట్ చేశాడు అజిత్ కుమార్…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *