కిర్లంపూడిలో జులై 24న మెగా పేరెంట్స్ డే*

July 21, 2026 | ఆంధ్రప్రదేశ్

*ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూకి ఆహ్వానం*

*జగ్గంపేట, జులై 21:* కిర్లంపూడి ప్రభుత్వ జూనియర్ కళాశాల మరియు ప్రభుత్వ ఉన్నత పాఠశాల సంయుక్తంగా ఈనెల 24న నిర్వహించే “మెగా పేరెంట్స్ డే” కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేయాలని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూను స్కూల్ అభివృద్ధి కమిటీ చైర్మన్ ఆళ్ల బాబులు ఆహ్వానించారు.రావులమ్మ నగర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో జరిగిన ఈ కార్యక్రమంలో ఆహ్వాన పత్రికను అందజేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి వచ్చి విద్యార్థులను ఆశీర్వదించాలని కోరారు.ఈ సందర్భంగా జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ, విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులను కలుపుతూ స్కూళ్లు, కళాశాలల అభివృద్ధికి మెగా పేరెంట్స్ డే ఎంతో ఉపయోగపడుతుందన్నారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చేస్తున్న విద్యా రంగ సంస్కరణలు, తల్లికి వందనం వంటి పథకాలు విద్యార్థుల భవిష్యత్తుకు దోహదపడతాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్యవైశ్య డైరెక్టర్ కొత్త కొండబాబు,ఆళ్ల శ్రీమన్నారాయణ, ప్రిన్సిపల్ వై కాంచనమాల, ఎం సుందరయ్య, వెంకటేశ్వరావు, మూర్తి, హైస్కూల్ హెచ్ఎం పి రమణి, ఎక్స్ అఫిషియో నెంబర్ దాడి గోవిందు తదితరులు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper