మహిళల ఆరోగ్యాన్ని ఉజ్వలంగా మార్చిన స్వస్త్ నారి, 3 గిన్నిస్ రికార్డులు సాధించిన కృషి

సాక్షి డిజిటల్ న్యూస్ :మహిళల ఆరోగ్యమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన స్వాస్థ్ నారీ, సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమానికి అరుదైన ఘనత దక్కించి. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమానికి గాను భారతదేశం మూడు గిన్నిస్ వరల్డ్‌ రికార్డులను అందుకుంది. ఒకే నెలలో అత్యధికంగా 3.21 కోట్లకుపైగా జనాలు ఈ హెల్త్‌కేర్ ప్లాట్‌ఫామ్‌లో రిజిస్టర్‌ చేసుకోవడంతో ఈ కార్యక్రమం ఈ ఫీట్‌ను సాధించింది. దేశ వ్యాప్తంగా మహిళల ఆరోగ్యమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం స్వాస్థ్య నారీ, సశక్త్ పరివార్ అభియాన్ (SNSPA) అనే కార్యక్రమాన్ని 2025లో కేంద్ర ప్రభుత్వం చేపట్టింది. సెప్టెంబర్ 17 అక్టోబర్ 2, 2025 ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా మహిళల ఆరోగ్యం, పోషకాహారం, వ్యాధి నిరోధక చర్యలు, కుటుంబ స్వాస్థ్యాన్ని ప్రోత్సహించడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. 20కి పైగా మంత్రిత్వ శాఖలు, విద్యా సంస్థలు, సమాజ సంఘాలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నాయి. దేశవ్యాప్తంగా 19.7 లక్షలకు పైగా ఆరోగ్య క్యాంపులు నిర్వహించబడి, 11 కోట్ల మందికి పైగా ప్రజలు పాల్గొన్నారు. అయితే తాజాగా ఈ కార్యక్రమం అదరుదైన రికార్డ్ క్రియేట్ చేసింది. రాష్ట్ర స్థాయిలో ఒక నెలలో ఈ హెల్త్‌కేర్ ప్లాట్‌ఫామ్‌లో అత్యధికంగా 3.21 కోట్లకుపై జనాలు రిజిస్టర్ కావడంతో ఈ కార్యక్రమం రికార్డులు క్రియేట్ చేసింది. అలాగే ఒక వారంలో రొమ్ము క్యాన్సర్ స్క్రీనింగ్ కోసం ఆన్‌లైన్‌లో అత్యధికంగా 9.94 లక్షలకు నమోదు చేసుకోగా.. స్క్రీనింగ్ టెస్ట్ కోసం అత్యధికంగా 1.25 లక్షలకు పైగా మంది నమోదు చేసుకున్నారు. ఇందుకు గాను మూడు వరల్డ్‌ గిన్నిస్ రికార్డులను భారతదేశం గెలుచుకుంది. అక్టోబర్ 31, 2025న యూనియన్ హెల్త్ మినిస్ట్రీకి ఈ గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ అధికారికంగా అందజేయబడ్డాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *