ఏపీలో ఏసీబీ ఆకస్మిక తనిఖీలు: అధికారులు భయాందోళనలో

సాక్షి డిజిటల్ న్యూస్ :ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో ఏసీబీ అధికారులు దాడులు చేస్తున్నారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలపై వచ్చిన పలు ఫిర్యాదుల నేపథ్యంలో మొత్తం 120పైగా ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు దాడులు కొనసాగుతున్నాయి.విశాఖ, అన్నమయ్య, కోనసీమ, ఏలూరుతో పాటు పలు జిల్లాల్లో ఏకకాలంలో ఏసీబీ దాడులు జరుగుతున్నాయి. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై అవినీతి ఆరోపణలు రావడంతో ఏసీబీ ఆకస్మిక దాడులు చేస్తోంది.కార్యాలయంలోకి బయట వ్యక్తులను అనుమతించకుండా ఏసీబీ అధికారులు గేట్లు వేసి సోదాలు చేస్తున్నారు. సాధారణ తనిఖీల్లో భాగంగానే ఈ దాడులు చేస్తున్నామని ఏసీబీ అధికారులు అంటున్నారు. తమ పరిధిలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను తనిఖీ చేస్తున్నామని ఏసీబీ డీఎస్పీ సుబ్బారావు చెబుతున్నారు. మధురవాడ, పెదగంట్యాడ సబ్ రిజిస్టేషన్ కార్యాలయాల్లోనూ ఏసీబీ సోదాలు జరుగుతున్నాయి. నెల్లూరులోని స్టోన్ హౌస్ పేట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై ఏసీబీ ఆకస్మిక దాడులు చేస్తోంది. ఏసీబీ అధికారులు ఆ కార్యాలయానికి తలుపులు వేసి పలు రికార్డులను పరిశీలిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *