కడుపుతో ఉన్న కూతురిని కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించిన తల్లిదండ్రులు: విచారకర ఘటన

సాక్షి డిజిటల్ న్యూస్ :జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం రాజరాంపల్లిలో సొంత తల్లిదండ్రులే తమ కూతుర్ని కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించడం కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం బసంత్ నగర్ కు చెందిన తమ్మిశెట్టి ప్రియాంక, జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం రాజక్కపల్లి గ్రామానికి చెందిన మర్రి రాకేష్‌ గత ఆరు సంవత్సరాల నుంచి ప్రేమించుకున్నారు. అబ్బాయి షెడ్యూల్డ్ క్యాస్ట్ కి చెందిన వ్యక్తి కావడంతో ప్రియాంక తల్లిదండ్రులు ఈ పెళ్ళికి నిరాకరించారు. దీంతో జులై 27న కులాంతర వివాహం చేసుకుంది. దీంతో ఆగ్రహించిన ప్రియాంక తల్లిదండ్రులు.. ప్రియాంక రాకేష్ లను విడదీసేందుకు విఫల ప్రయత్నాలు కొనసాగించారు. కానీ, ప్రియాంక రాకేష్ వైపు బలంగా నిలబడడంతో ఏమీ చేయలేకపోయారు. నాలుగు నెలల తర్వాత ప్రియాంక కడుపుతో ఉందని కూడా చూడకుండా జన సందోహం మధ్యలోనే ప్రియాంక తండ్రి వెంకటేష్, బావ గుంజే కుమార్ లు కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించడం కలకలం రేపింది.

అమ్మ నమ్మించి మోసం చేసింది: బాధితురాలు ప్రియాంక తమ అమ్మే తనను నమ్మిచ్చి మోసం చేసిందనీ బాధితురాలు ప్రియాంక కన్నీటి పర్యంతం అయ్యింది. మంచిగా బతుకుర్రి బిడ్డా అంటూ ఇంటికీ వచ్చి దగ్గరైందనీ, కడుపుతో ఉన్నా అని.. చెప్పినప్పుడు హాస్పిటల్ తీసుకెళ్తానని నమ్మిచ్చిందని వాపోయింది. జగిత్యాల హాస్పిటల్ లో చూపించిన అనంతరం రాజారాంపల్లి రాగానే ముందస్తు పథకం ప్రకారం భహిర్భూమి నెపంతో తమ అత్తమ్మను బయటికి తీసుకెళ్లిందని.. ఆమె, వెళ్ళగానే తన తండ్రి వెంకటేష్, తన అక్క భర్త గుంజ కుమార్ లు కార్ లో వచ్చి కిడ్నాప్ కు ప్రయత్నించారని చెప్పింది.. స్థానికుల సహాయంతో తప్పించుకుని పోలీసుల సాయంతో క్షేమంగా ఇంటికి చేరానంటూ ప్రియాంక కన్నీటి పర్యంతం అయ్యింది. తల్లిదండ్రులపై పోలీసులకు ఫిర్యాదు చేసిన ప్రియాంక.. తనని కిడ్నాప్ చేయుటకు ప్రయత్నించి, చంపుతా అంటూ బెదిరించిన తల్లిదండ్రులపై బాధితురాలు ప్రియాంక పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనకు, తన భర్త రాకేష్ కు తల్లిదండ్రులతో పాటు అక్క భర్త తో ప్రాణ భయం ఉందనీ, రక్షణ కల్పించాలని ప్రియాంక ఫిర్యాదులో పేర్కొన్నది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *