రామ్ చరణ్ సినిమా వదిలి సీరియల్ వైపు మళ్లిన స్టార్!

సాక్షి డిజిటల్ న్యూస్ :ఒక్కోసారి పెద్ద సినిమాలు, స్టార్ హీరోల సినిమా ఆఫర్స్ వచ్చినా పలు కారణాలతో రిజెక్ట్ చేయాల్సి వస్తుంది. తాజాగా సీరియల్ యాక్టర్ ఇంద్రనీల్ రామ్ చరణ్ సినిమాని రిజెక్ట్ చేయాల్సి వచ్చింది అన్నారు. గతంల పలు సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించిన ఇంద్రనీల్ ఆ తర్వాత సీరియల్స్ లో బిజీ అయ్యారు. సీరియల్స్, టీవీ షోలతో మంచి ఫేమ్ తెచ్చుకున్నారు ఇంద్రనీల్.ప్రస్తుతం సీరియల్స్ తో బిజీగానే ఉన్న ఇంద్రనీల్ మళ్ళీ సినిమాల్లోకి వస్తున్నారు. ఇంద్రనీల్ గతంలో రామ్ చరణ్ తో కలిసి ఆరెంజ్ సినిమాలో నటించారు. ఇప్పుడు ఆది సాయి కుమార్ శంబాలా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో జరిగిన ఓ ఈవెంట్లో ఇంద్రనీల్ ని ఇన్నాళ్లు సినిమాలకు ఎందుకు గ్యాప్ ఇచ్చారు అనే ప్రశ్న ఇవ్వగా సమాధానమిచ్చారు.ఇంద్రనీల్ మాట్లాడుతూ.. ఆరెంజ్ సినిమా తర్వాత చరణ్ ఎవడు సినిమాకు కూడా అడిగారు. ఆ సినిమాలో రాజీవ్ కనకాల క్యారెక్టర్ కోసం నన్ను అడిగారు. మేనేజర్ ఫోన్ చేసి చరణ్ సర్ అడగమన్నారు అని చెప్పారు. కానీ ఆ సినిమా రిజెక్ట్ చేయాల్సి వచ్చింది. ఆ సమయంలో కె విశ్వనాధ్ గారితో సూర్య పుత్రుడు అనే సీరియల్ చేస్తున్నాను. ఫస్ట్ టైం ఆయన సీరియల్ చేసారు. నాకు ఫాదర్ పాత్రలో నటించారు. ఆ సీరియల్ డేట్స్ క్లాష్ అవ్వడంతో ఎవడు సినిమా చేయలేకపోయాను. ఆ తర్వాత నేను సీరియల్స్ తో బిజీ అవ్వడంతో సినిమాల మీద ఫోకస్ చేయలేదు. మంచి పాత్రలు కూడా రాలేదు. ఇన్నాళ్లు వెయిట్ చేశాను. ఇప్పుడు ఈ సినిమా నాకు కంబ్యాక్ అవుతుంది అని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *