పృథ్వీరాజ్ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల: జక్కన్న

సాక్షి డిజిటల్ న్యూస్ :ప్రస్తుతం యావత్ ఇండియన్ మూవీ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా SSMB 29. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కిస్తోన్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి పృథ్వీరాజ్ సుకుమారన్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా SSMB 29. ఇది వర్కింగ్ టైటిల్ మాత్రమే. డైరెక్టర్ రాజమౌళి మరోసారి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్న ఈ సినిమా పై పాన్ ఇండియా లెవల్లో విపరీతమైన క్రేజ్ ఉంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రతి విషయంపై ఓ రేంజ్ హైప్ నెలకొంది. యాక్షన్ అడ్వెంచర్ డ్రామాగా వస్తున్న ఈ సినిమాలో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా, మలయాళీ స్టార్ పృథ్వీరాజ్ సుకుమార్ తోపాటు హాలీవుడ్ స్టార్స్ సైతం కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ప్రతి అప్డేట్ ను #GlobeTrotter అనే హ్యాష్ ట్యాగ్ తో షేర్ చేస్తున్నారు జక్కన్న. తాజాగా ఈ మూవీ నుంచి పృథ్వీరాజ్ ఫస్ట్ లుక్ పోస్టర్ రివీల్ చేశారు.ప్రస్తుతం విడుదలైన పోస్టర్ చూస్తుంటే జక్కన్న సినిమాలో పృథ్వీరాజ్ సరికొత్త పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఒక వీల్ చైర్ లో కూర్చుని రోబో సాయంతో ఒక భారీ పైట్ సీన్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రముఖ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ ను ప్రేరణగా తీసుకుని ఈపాత్రను డిజైన్ చేసినట్లుగా తెలుస్తోంది. పృథ్వీరాజ్ పాత్ర గురించి జక్కన్న.. “పృథ్వీతో మొదటి షాట్ చిత్రీకరించిన తర్వాత నేను అతడి దగ్గరకు వెళ్లి, మీరు నాకు తెలిసిన అత్యుత్తమ నటులలో ఒకరు అని చెప్పాను. ఈ దుష్ట, క్రూరమైన, శక్తివంతమైన విరోధి కుంభకు ప్రాణం పోయడం సృజనాత్మకంగా చాలా సంతృప్తికరంగా ఉంది. పృథ్వీకి ధన్యవాదాలు” అంటూ రాసుకొచ్చారు. ఈ సినిమా టైటిల్ తోపాటు మహేష్ బాబు ఫస్ట్ లుక్ పోస్టర్ ఈనెల 15న రిలీజ్ చేయనున్నారు. అందుకే నవంబర్ 15న రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ వేడుక నిర్వహించనున్నట్లు జక్కన్న తెలిపారు. ఈ కార్యక్రమాన్ని జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ వేడుక కోసం ప్రియాంక చోప్రా ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *