Uncategorized

అనాధలను మానవత్వంతో ఆదుకోవాలి

జ్ఞానతెలంగాణ, శంకర్ పల్లి: శంకర్పల్లి మున్సిపల్ పరిధిలో గతవారం రోజులు గా ఒక మహిళ అర్ధ నగ్నంగా తిరుగుతుంది ఇట్టి విషయాన్ని సేవా ఫౌండేషన్ సభ్యుడు రామ్ రెడ్డి గమనించి ఫౌండేషన్ అధ్యక్షులు నరేష్ కుమార్ కి తెలియజేశారు నరేష్ కుమార్ మున్సిపల్ మేనేజర్ అంజన్ కుమార్ తో మాట్లాడి వారి సిబ్బంది సహకారంతో ఆ మహిళకు స్నానం చేయించి బట్టలు వేయడం జరిగింది నరేష్ కుమార్ మాట్లాడుతూ ఇలాంటి సంఘటనలు సమాజం లో ఎక్కడ జరిగిన మానవతా హృదయంతో అందరూ సహకరించి ఆదుకోవాలి అని తెలిపారు ఈ సంఘటనకు వెంటనే స్పందించిన మున్సిపల్ మేనేజర్ అంజన్ కుమార్ మరియు వారి సి బ్బందికి ధన్యవాదాలు తెలిపారు కార్యక్రమంలో సేవా ఫౌండేషన్ సభ్యులు కరాటే రవీందర్ రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *