ట్రంప్ షాక్! అమెరికాలోని ప్రతి పౌరుడికి రూ.1.77 లక్షలు ఇవ్వనున్నట్లు ప్రకటన

సాక్షి డిజిటల్ న్యూస్ :తన టారిఫ్‌ల విధానంపై యూఎస్ సుప్రీంకోర్టు న్యాయబద్ధతను ప్రశ్నిస్తున్నా, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. తన టారిఫ్‌ల విధానాన్ని వ్యతిరేకించేవారంతా ‘మూర్ఖులు’ అని ట్రూత్ సోషల్ వేదికగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. టారిఫ్‌ల ద్వారా సేకరించిన ఆదాయంలో నుంచి, త్వరలోనే ప్రతి అమెరికన్‌కు కనీసం $2,000 (సుమారు ₹1.77 లక్షలు) డివిడెండ్‌గా ఇస్తానని ఆయన వాగ్దానం చేశారు. ఈ సుంకాల వల్లే అమెరికా ప్రపంచంలో అత్యంత ధనిక దేశంగా మారిందని ట్రంప్ వాదించారు.అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన సుంకాల విధానాన్ని మరోసారి తీవ్రంగా సమర్థించుకున్నారు.టారిఫ్‌లు అమెరికాను అత్యంత ధనికమైన, ఎక్కువగా గౌరవించబడే దేశంగా మార్చాయని ఆయన ప్రకటించారు. తన విధానాలను వ్యతిరేకించేవారిని మూర్ఖులుగా అభివర్ణించిన ట్రంప్.. తన పాలనా యంత్రాంగం సేకరించిన టారిఫ్ ఆదాయం నుంచి ధనవంతులు మినహా ప్రతి అమెరికన్‌కు త్వరలోనే కనీసం 2,000 డాలర్ల (భారత కరెన్సీ ప్రకారం సుమారు రూ.1.77 లక్షలు) డివిడెండ్‌గా ఇస్తానని హామీ ఇచ్చారు. ట్రంప్ చేసిన ఈ ప్రకటన.. ఆయన విస్తృత టారిఫ్‌ల చట్టబద్ధతపై యూఎస్ సుప్రీంకోర్టు అనుమానాలు వ్యక్తం చేసిన కొద్ది రోజులకే రావడం గమనార్హం.సుంకాల ద్వారా వచ్చే ఆదాయంలోంచి.. ప్రతీ ఒక్కరికి 2 వేల డాలర్లు ట్రూత్ సోషల్ వేదికగా ట్రంప్ మాట్లాడుతూ.. తమ విధానాల వల్లే అమెరికాలో ద్రవ్యోల్బణం దాదాపు లేదని, స్టాక్ మార్కెట్ ధరలు రికార్డు స్థాయిలో ఉన్నాయని పేర్కొన్నారు. “మేము ట్రిలియన్ల డాలర్లు వసూలు చేస్తున్నాము. త్వరలోనే మా అపారమైన అప్పును (37 ట్రిలియన్ డాలర్లు) చెల్లించడం ప్రారంభిస్తామని ఆయన తెలిపారు. టారిఫ్‌ల కారణంగానే అమెరికాలో రికార్డు స్థాయిలో పెట్టుబడులు, ప్లాంట్లు, కర్మాగారాలు వెలుస్తున్నాయని.. అందుకే ప్రతి ఒక్కరికీ 2,000 డాలర్ల డివిడెండ్ చెల్లిస్తామని ఆయన హామీ ఇచ్చారు.మరోవైపు ట్రంప్ టారిఫ్‌ విధానం ప్రస్తుతం చట్టపరమైన సవాళ్లను ఎదుర్కొంటోంది. జాతీయ అత్యవసర పరిస్థితుల్లో వినియోగించేందుకు ఉద్దేశించిన 1977 చట్టం కింద టారిఫ్‌లను విధించడంలో అధ్యక్షుడు కాంగ్రెస్ అధికార పరిధిని అతిక్రమించారంటూ సుప్రీం కోర్టు న్యాయమూర్తులు ఇటీవలే తెలిపారు. దీనిపై ట్రంప్ తరఫు న్యాయవాదిని న్యాయమూర్తులు ప్రశ్నిస్తూ.. అనధికారిక కాల పరిమితితో టారిఫ్‌లను విధించడానికి అధ్యక్షుడు ఈ చట్టాన్ని ఉపయోగించడం కాంగ్రెస్ అధికార పరిధిని అతిక్రమించడమే అవుతుందా అని ప్రశ్నించారు. ఈ చట్టాన్ని ఉపయోగించడం ద్వారా ట్రంప్ తన అధికారాన్ని అతిక్రమించారని దిగువ కోర్టులు ఇప్పటికే తీర్పును ఇచ్చాయి.ట్రంప్ తన వ్యాఖ్యల్లో ఈ న్యాయపరమైన సవాళ్లపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జాతీయ భద్రత కోసం కూడా సుంకం విధించడానికి అధ్యక్షుడికి అధికారం లేకపోతే ఎలా అని ప్రశ్నించారు. ఈ టారిఫ్‌లు రాబోయే దశాబ్దంలో అమెరికాకు ట్రిలియన్ల డాలర్ల ఆదాయాన్ని అందించే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ కేసుపై సుప్రీం కోర్టు ఇచ్చే తీర్పు, ట్రంప్ అధికార పరిధికి ఒక ప్రధాన పరీక్షగా నిలవనుంది. చూడాలి మరి ఏం జరగనుంది అనేది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *