October 3, 2026
Breaking News

తెలంగాణ

ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు

ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు

సాక్షి డిజిటల్ న్యూస్ ఆగస్టు 18 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి : సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతిని పురస్కరించుకొని కూకట్‌పల్లి నియోజకవర్గ పరిధిలోని కూకట్ పల్లి,బాలాజీనగర్,మూసాపేట్ పలు డివిజన్ లలో గౌడ సంఘం ఆధ్వర్యంలో జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.గౌడ సంఘం సభ్యుల ఆహ్వానం మేరకు రాష్ట్ర బీజేపీ సీనియర్ నాయకులు వడ్డేపల్లి రాజేశ్వరరావు కార్యక్రమాల్లో పాల్గొని సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాలకు, చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం గౌడ సంఘం సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వరరావు కి ఘన స్వాగతం పలికి శాలువాతో సన్మానించారు.ఈ సందర్భంగా వడ్డేపల్లి రాజేశ్వరరావు మాట్లాడుతూ, అణగారిన వర్గాల నుంచి ఎదిగి, సామాన్య ప్రజలనే తన పోరాట శక్తిగా మలుచుకుని తెలంగాణ నేలపై స్వీయ పాలనకు పునాది వేసిన అసాధారణ ప్రజా యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని కొనియాడారు. సుమారు మూడున్నర శతాబ్దాల క్రితమే సామాజిక అసమానతలు, దోపిడీ, ఆధిపత్యానికి వ్యతిరేకంగా ప్రజల ఆత్మగౌరవం కోసం పాపన్న గౌడ్ పోరాడారని ఆయన పేర్కొన్నారు. సామాన్యుడిగా ప్రారంభమై నాయకుడిగా, యోధుడిగా, పాలకుడిగా ఎదిగి తన కాలంలోని అధికార వ్యవస్థను సవాలు చేసిన ప్రజా వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని అన్నారు.పాపన్న గౌడ్ ఒక వ్యక్తి మాత్రమే కాదని, అణగారిన వర్గాల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన చారిత్రక తిరుగుబాటు అని వడ్డేపల్లి రాజేశ్వరరావు తెలిపారు. ఆయన ధైర్యం, ప్రజా సంక్షేమ దృక్పథం, సమానత్వ భావన నేటి తరానికి స్ఫూర్తిదాయకమని అన్నారు.సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు ఐక్యంగా కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో గౌడ సంఘం నాయకులు, సభ్యులు, స్థానిక బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📰 ePaper