రాజోలి మండలంలోని ఎమ్మార్వో (తహశీల్దార్) కార్యాలయం ఉండాలి. రైతులు విజ్ఞప్తి.
సాక్షి డిజిటల్ డివిజన్ గద్వాల్,జులై 21,రాజోలి మండలం న్యూస్,జోగులాంబ గద్వాల జిల్లా, రాజోలి మండలంలోని ఎమ్మార్వో (తహశీల్దార్) కార్యాలయాన్ని పాత నిర్మాణం రాజోలిలోనే నిర్మించాలని మండలంలోని 11 గ్రామాల ప్రజలు రైతులు ఏకగ్రీవంగా అంగీకరించారు, ఈ సందర్భంగా వారు తెలుపుతూ పాత రాజోలి ప్రాంతం మండలంలోని అన్ని గ్రామాల వారికీ మధ్యభాగంలో ఉండటంతో పాటు, రవాణా పరంగా అందరికీ ఎంతో సౌకర్యంగా ఉంటుంది. ప్రజలందరికీ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలంటే ఎమ్మార్వో కార్యాలయం రాజోలు మండలంలో ఉండటం అత్యంత ముఖ్యమని రైతులు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు,ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఎమ్మార్వో ఆఫీస్‌ను పాత రాజోలిలోనే ఉండాలని రైతులు కోరారు.